Share News

సంచికి రెండు కిలోలు!

ABN , Publish Date - May 12 , 2025 | 12:22 AM

రేషన దుకాణాల ద్వారా పేదలకు సన్నబియ్యం అందించాలనే ప్రభుత్వ నిర్ణయం డీలర్లకు తలనొప్పిగా మారింది.

సంచికి రెండు కిలోలు!
50 కిలోల బస్తాకు 47,870 కిలోలు చూపిస్తున్న తూకం

తూకాల్లో తేడా

నష్టపోతున్న రేషన డీలర్లు

రేషన దుకాణాల ద్వారా పేదలకు సన్నబియ్యం అందించాలనే ప్రభుత్వ నిర్ణయం డీలర్లకు తలనొప్పిగా మారింది. సన్నబియ్యం సంచి తూకంలో వస్తున్న తేడాలతో తీవ్రంగా నష్టం వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 50 కిలోల బియ్యం బస్తాను తూకం వేయగా 48 కిలోలకు తక్కువగానే ఉంటున్నాయని ఒక్కో సంచికి రెండు కిలోలకు పైగా తక్కువగా వస్తుందని డీలర్లు ఆరోపిస్తున్నారు. జిల్లాలోని పలువురు డీలర్లు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. క్వింటాకు ఇచ్చే రూ.150 కమీషన కూడా తరుగుతో కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

- (ఆంధ్రజ్యోతి-భువనగిరి(కలెక్టరేట్‌)

యాదాద్రిభువనగిరి జిల్లాలో మొత్తం 515 రేషన దుకాణాలకు 2,03,627 ఆహార భద్రతాకార్డులున్నాయి. 6,67,403 యూనిట్లు, 13,696 అంత్యోద య అన్నయోజన కార్డులు, 38,965 యూనిట్లకు సన్నబియ్యం పంపిణీ జరుగుతోంది. జిల్లాలో ఉన్న ఐదు పౌర సరఫరాల శాఖ గోదాంలు భువనగిరి, ఆలేరు, మోత్కూరు, రామన్నపేట, చౌటుప్పల్‌ నుంచి ప్రతినెలా జిల్లాకు 4 వేల మెట్రిక్‌ టన్నుల కు పైగా బియ్యం సరఫరా అవుతున్నట్లు అధికారు లు చెబుతున్నారు. కార్డుదారులు రేషన దుకాణాల కు వెళ్లి ఒక వ్యక్తికి 6 కిలోల చొప్పున వారికి వచ్చే బియ్యంఎలకా్ట్రనిక్‌ కాంటాపై సరితూగినప్పుడు బ యోమెట్రిక్‌ విధానం నమోదుచేస్తేనే రశీదు వస్తుం ది. దీంతో లబ్ధిదారులకు గ్రాము బియ్యం తగ్గకుం డా బియ్యం సక్రమంగా సరఫరా అవుతున్నాయి.

బియ్యం కొనుగోలపై లబ్ధిదారుల్లో ఆసక్తి

రాష్ట్ర ప్రభుత్వం ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీ చేస్తుండటంతో లబ్ధిదారులు రేషన బి య్యం తీసుకెళ్లడానికి ఆసక్తి చూపిస్తున్నారు. గతం లో దొడ్డుబియ్యం తీసుకెళ్లే వారు కాదు. దీంతో డీలర్లకు తరుగు వస్తున్నా కొంత మేర ఉపశమనం కలిగేది. అయితే రెండు నెలలుగా లబ్ధిదారులు స న్నం బియ్యం తీసుకెళ్తున్నారు. తూకం వేశాకే బిల్లు వస్తుండటంతో లబ్ధిదారుడికి తక్కువగా ఇచ్చే అవకాశం లేదు. దీంతో డీలర్లే నష్టపోవాల్సి వస్తోంది.

సరిపడా బియ్యం ఇవ్వాలి

గోదాముల నుంచి దుకాణాలకు వచ్చేటప్పటికీ బస్తాలలో బియ్యం తగ్గుతోంది. ఒక్కో సంచికి కిలో, కొన్ని సంచుల కు రెండు కిలోలకు పైగా తక్కువగా వస్తోంది. లబ్ధిదారులకు సరిగ్గా తూకం వేసి పంపిణీ చేస్తున్నాం. బియ్యం బస్తాలలో తరుగుతో నష్టం వస్తోంది. దొడ్డుబియ్యం పంపిణీ చేసినప్పుడు కొందరు లబ్ధిదారులు తీసుకెళ్లలేదు. ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తుండటంతో లబ్ధిదారులు అందరూ తీసుకెళ్తున్నారు. తరుగు లేకుండా సరిపడా బియ్యం కేటాయించాలి.

- చల్లూరి పోచయ్య, డీలర్ల సంఘం అధ్యక్షుడు

తరుగుకు అవకాశం లేదు

బియ్యం బస్తాల్లో తరుగు ఉండే అవకాశం లేదు. 50 కిలోల బస్తా అయినప్పటికీ సంచి కొలమానం కాకుండా డీలర్లకు యూనిట్ల వారీగా ఎం తైతే రావాలో ఒకేసారి కాంటా వేసి పంపుతున్నాం. ఇప్పుడు తరుగు ఎందుకు వస్తున్నాయో కారణాలను ఆరా తీస్తాం. ఒక్కోసారి కొన్ని బస్తాల్లో ఎక్కువ బియ్యం కూడా ఉం టాయి. డీలర్లు తరుగు ఎక్కువగా వస్తే ఫిర్యాదుచేయాలి. గోదాంల వద్ద బియ్యం తూకాలు సరిగ్గా జరిగేలా చర్యలు తీసుకుంటాం..

- హరిక్రిష్ణ, పౌర సరఫరాల సంస్ధ జిల్లా మేనేజరు

Updated Date - May 12 , 2025 | 12:22 AM