Share News

సంతకం ఫోర్జరీ కేసులో ఇద్దరి అరెస్టు

ABN , Publish Date - Jul 26 , 2025 | 12:17 AM

సంస్థాన్‌నారాయణపురం, జూలై 25 (ఆంధ్రజ్యోతి): గెజిటెడ్‌ అధికారి సంతకాల ఫోర్జరీ కేసులో సంస్థాన్‌ నారాయణపురం మండలంలో పోలీసులు ఇద్దరిని రిమాండ్‌కు తరలించారు.

సంతకం ఫోర్జరీ కేసులో   ఇద్దరి అరెస్టు

సంస్థాన్‌నారాయణపురం, జూలై 25 (ఆంధ్రజ్యోతి): గెజిటెడ్‌ అధికారి సంతకాల ఫోర్జరీ కేసులో సంస్థాన్‌ నారాయణపురం మండలంలో పోలీసులు ఇద్దరిని రిమాండ్‌కు తరలించారు. సంస్థాన్‌నారాయణపురం పట ్టణానికి చెందిన గవ్వల సందీప్‌ మండల కేం ద్రంలో మీ సేవ కేంద్రం నిర్వహిస్తున్నాడు. అందులో చిల్లాపురం గ్రామానికి చెందిన నెరుగు శేఖర్‌ పనిచేస్తున్నాడు. అయితే ప్రభు త్వం కల్యాణలక్ష్మి పథకం సాయం కోసం దర ఖాస్తు చేసుకునే సమయంలో గెజిటెడ్‌ అధి కారి చేయించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కొందరు లబ్ధిదారులు దరఖాస్తు చేసుకునే స మయంలో మండల వైద్యాధికారిని సంప్రదిం చకుండానే సంతకాన్ని ఫోర్జరీ చేశారు. ఇటీ వల సంతకాలు ఫోర్జరీ చేస్తున్నట్లు సమా చారం రావడంతో ఆర్డీవో అధికారులు తనిఖీ చేశారు. ఆ తనిఖీలో సంతకాలను పరిశీలించి వైద్యాధికారిని విచారించారు. విచారణలో సంతకాల ఫోర్జరీ జరిగినట్టు తేలడంతో వారిని అరెస్టు చేశారు. వారి వద్ద నుండి ఫోర్జరీకి ఉపయోగించిన స్టాంప్‌లను స్వాధీ నం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - Jul 26 , 2025 | 12:17 AM