Share News

తుంగతుర్తి కాంగ్రె్‌సలో చిచ్చు

ABN , Publish Date - May 01 , 2025 | 01:01 AM

తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్‌లో వర్గపోరు ముదురుతోంది. మందుల సామేలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక రెండు, మూడు నెలలపాటు కలిసికట్టుగా ఉన్న క్యాడర్‌లో ఆ తర్వాత విభేదాలు మొదలయ్యాయి. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కుమ్ములాటల నేపథ్యంలో పీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షినటరాజన్‌, పీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్‌గౌడ్‌కు నాయకులు పరస్పర ఫిర్యాదులు చేసుకున్నా రు.

తుంగతుర్తి కాంగ్రె్‌సలో చిచ్చు

సూర్యాపేట జిల్లా పార్టీ సమావేశంలో రగడ

ఎమ్మెల్యే వర్గంపై కాంగ్రెస్‌ పాత నేతల అసమ్మతి

ఏడాది కాలంగా సాగుతున్న వర్గపోరు

అధిష్ఠానం కలగజేసుకోకుంటే పరిస్థితి చేజారిపోతుందని కార్యకర్తల ఆందోళన

(ఆంధ్రజ్యోతిప్రతినిధి, నల్లగొండ): తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్‌లో వర్గపోరు ముదురుతోంది. మందుల సామేలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక రెండు, మూడు నెలలపాటు కలిసికట్టుగా ఉన్న క్యాడర్‌లో ఆ తర్వాత విభేదాలు మొదలయ్యాయి. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కుమ్ములాటల నేపథ్యంలో పీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షినటరాజన్‌, పీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్‌గౌడ్‌కు నాయకులు పరస్పర ఫిర్యాదులు చేసుకున్నా రు. తాజాగా, బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన విస్తృతస్థాయి సమావేశం లో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేయడం విభేదాలు తారస్థాయికి చేరాయని పార్టీ కార్యకర్తలు పేర్కొంటున్నారు.

సూర్యాపేటలో బుధవారం జరిగిన పార్టీ సమావేశానికి పీసీసీ పరిశీలకులుగా ఎమ్మెల్యే లు మురళినాయక్‌, ఎడ్మబొజ్జు హాజరయ్యారు. ఎమ్మెల్యే సామేలు సమావేశంలోకి రాగానే వారి సమక్షంలోనే అర్వపల్లి మండలానికి చెందిన నా యకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే డౌన్‌ డౌన్‌ అం టూ నినాదాలు చేశారు. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలను ప్రభుత్వ పథకాల లబ్ధిదారులుగా ఎంపికచేసి కాంగ్రెస్‌ కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. సమావేశం రసాభాసగా మారే పరిస్థితి నెలకొనడంతో డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్నయాదవ్‌, తదితర నా యకులు కలగజేసుకొని సమావేశంలో నిరసన లు వద్దని, ఇబ్బందులు, వాదనలను పార్టీకి నివేదించాలని సూచించి విషయం ముదరకుండా నిలువరించడంతో పరిస్థితి సర్దుమణిగింది.

ఏడాదిగా గ్రూప్‌వార్‌

తుంగతుర్తి ఎమ్మెల్యేగా మందుల సామేలు ఎన్నికైన మూడు నాలుగు నెలల నుంచే వర్గవిభేదాలు మొదలయ్యాయి. నియోజకవర్గంలోని పాత కాంగ్రెస్‌ నాయకులకు, సామేలుతో కలిసి కాంగ్రె్‌సలోకి వచ్చిన కొత్త కాంగ్రెస్‌ నాయకుల మధ్య విభేదాలు పొడసూపడంతో నియోజకవర్గవ్యాప్తంగా వర్గపోరు ప్రారంభమైం ది. ప్రధానంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలైన ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్‌యువవికాసం లబ్ధిదారు ల ఎంపికలో పాత కాంగ్రెస్‌ కార్యకర్తలకు అవకాశం దక్కడం లేదని, ఎమ్మెల్యే బీఆర్‌ఎస్‌ నుం చి వచ్చిన కార్యకర్తలకు మాత్రమే ఈ పథకాల్లో ప్రాఽధాన్యమిస్తున్నారని ఆయన్ను వ్యతిరేకిస్తున్న వర్గీయుల ప్రధాన ఆరోపణ. అయితే అలాంటిదే మీ లేదని, పార్టీలో అందరినీ కలుపుకుపోతున్నామని, సీనియర్లను గౌరవిస్తున్నామని సామేలు చెబుతున్నారు. పథకాల లబ్ధిదారుల ఎంపికలో అర్హులైనవారికే అవకాశం ఇస్తున్నారని, నిబంధనల మేరకే లబ్ధిదారుల ఎంపిక ఉంటుందనేది ఎమ్మెల్యే వర్గీయులు పేర్కొంటున్నారు. నియోజకవర్గంలో ప్రతీ మండలంలో బీఆర్‌ఎస్‌ నుంచి వచ్చిన వారికే ప్రాఽధాన్యమిస్తూ వారు చెప్పిందే అమలయ్యేట్టు అధికారులను ఎమ్మెల్యే పురమాయిస్తున్నారని, ఇటీవల చేపట్టిన ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎ్‌స పనులను సైతం బీఆర్‌ఎస్‌ నుంచి వచ్చిన, తనకు అనుకూలమైన వ్యక్తికే పనుల బాధ్యత అప్పగించారని ఎమ్మెల్యే వ్యతిరేక వర్గీయులు ఆరోపిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సామేలు తీవ్రస్థాయిలో విమర్శించిన బీఆర్‌ఎస్‌ నాయకుడినే ఇప్పుడు చేరదీసి, ఆయ న కనుసన్నల్లో మండలాన్ని నడపాలని చూస్తున్నారని, మరో రెండు మండలాలకు చెందిన కీలక నాయకులిద్దరు ఇప్పటికీ బీఆర్‌ఎస్‌ నేతలతో టచ్‌లో ఉన్నారని ఆరోపిస్తున్నారు. అలాంటివారిని నమ్మి ఎమ్మెల్యే, నియోజకవర్గంలో పాత కాంగ్రెస్‌ నాయకులకు అన్యాయం చేస్తున్నారని, దీంతో పార్టీ బలహీనపడుతోందని వ్యతిరేకవర్గ నాయకులు విమర్శిస్తున్నారు. అయితే ఎమ్మెల్యే వర్గీయులు మాత్రం ఇదంతా ఓర్వలేక చేస్తున్నారే తప్ప ఆరోపణల్లో వాస్తవం లేదని, పార్టీలో ఎమ్మెల్యే అందరికీ సమప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొంటున్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు సమాంతరంగా వర్గాన్ని నడపాలని, ప్రభుత్వ వ్యవహారాలను తమ గుప్పిటపట్టాలని చూస్తున్న నాయకులే దీనంతటికీ కారణమని, అసలైన నాయకులు, కార్యకర్తలకు ఎక్కడా ఇబ్బంది లేదని, ఇదంతా కొందరు నేతలు కుట్రతో ప్రోత్సహిస్తుండడం వల్లే అసమ్మతి ఘటనలు జరుగుతున్నాయని సామేలు వర్గీయులు చెబుతున్నారు.

అధిష్ఠానానికి ఫిర్యాదులు

తుంగతుర్తి నియోజకవర్గంలో పార్టీ రెండు వ ర్గాలుగా విడిపోయిన విషయం ఇప్పటికే అధిష్ఠానం దృష్టి లో ఉంది. గతంలో ఇలాగే అసమ్మతి కార్యక్రమాలు జరిగినప్పుడు పీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్‌గౌడ్‌కు, తాజాగా పీసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌కు ఇరువర్గాలు ఫిర్యాదు చేసుకున్నాయి. నియోజకవర్గంలో సమన్వయ కమిటీని నియమించి, అసమ్మతి లేకుండా చేస్తామని పీసీసీ అధ్యక్షుడు హామీ ఇచ్చినా ఇంతవరకు కమిటీ నియమించలేదు. తాజాగా మళ్లీ గలాటా జరగడంతో ఇకనైనా పార్టీ అధిష్ఠానం దృష్టి సారించి అసమ్మతిని సద్దుమణిచే చర్యలు చేపట్టాలని సీనియర్‌ నాయకులు విన్నవిస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తినాల్సి వస్తుందని, పైగా పార్టీ పట్టుకోల్పోతుందన్న విషయాన్ని అధిష్ఠానం గ్రహించాలని సూచిస్తున్నారు.

Updated Date - May 01 , 2025 | 01:01 AM