నేడు హనుమాన్ విజయయాత్ర
ABN , Publish Date - Apr 12 , 2025 | 12:55 AM
విశ్వహిందూ పరిషత్, బజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో శనివారం భువనగిరిలో వీర హనుమాన్ విజయ శోభాయాత్ర నిర్వహించనున్నారు. ఇందుకు పట్టణంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. పట్టణాన్ని కాషాయ జెండాలు, తోరణాలతో అలంకరించారు.

ఏర్పాట్లు పూర్తి చేసిన నిర్వాహకులు
భువనగిరి టౌన్, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): విశ్వహిందూ పరిషత్, బజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో శనివారం భువనగిరిలో వీర హనుమాన్ విజయ శోభాయాత్ర నిర్వహించనున్నారు. ఇందుకు పట్టణంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. పట్టణాన్ని కాషాయ జెండాలు, తోరణాలతో అలంకరించారు. స్థానిక హెచ్‌బీ కాలనీ ఎదురుగా ఉన్న గురు నిలయంలో ని పెరమాల్ల హనుమాన్ ఆలయంలో పూజలు చేశాక, ప్రారంభమయ్యే విజయ యా త్ర పట్టణ ప్రధాన వీధుల గుండా సాగి జగదేవ్‌పూర్ రోడ్డులోని అంజనాద్రి ఆలయం లో ముగుస్తుందని నిర్వాహకులు తెలిపారు. దేవాలయాలు, పలు సంఘాల ఆధ్వర్యం లో శోభాయాత్రకు స్వాగతం పలికి మజ్జిగ, నీళ్లు, పులిహోర ప్యాకెట్లు అందజేయనున్నా రు. ఇందుకోసం పలు ప్రాంతాల్లో స్వాగత ప్లెక్సీలు, వేదికలు ఏర్పాటుచేశారు. హిందువులందరూ యాత్రలో పాల్గొనాలని కోరారు. కాగా శోభాయాత్రను పురస్కరించుకొని పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లుచేశారు. భక్తిభావంతో ర్యాలీ నిర్వహించాలని, ఇతరులను కించపరిచే విధంగా వ్యవహరించవద్దని సూచించారు. అలాగే రోజంతా మద్యం, కల్లు దుకాణాలను మూసివేయాలని ఎక్సైజ్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.