మూడు నెలల బియ్యం.. ఒకేసారి
ABN , Publish Date - May 25 , 2025 | 12:23 AM
వర్షాకాలంతోపాటు ప్రకృతి విపత్తుల దృష్ట్యా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుం డా ఉండేందుకు మూడు నెలలకు సం బంధించిన రేషన్ (ఆహారభద్రతా కార్డు లు) బియ్యాన్ని ప్రభుత్వం ఒకేసారి పంపి ణీ చేయనుంది. ఇందుకోసం జిల్లా యంత్రాంగం తగిన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తోంది.

జిల్లాలో మొత్తం 2,18,963 రేషన్‌కార్డులు
13,517.796 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం అవసరం
పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు
వర్షాకాలంతోపాటు ప్రకృతి విపత్తుల దృష్ట్యా నిర్ణయం
(ఆంధ్రజ్యోతి-యాదాద్రి): వర్షాకాలంతోపాటు ప్రకృతి విపత్తుల దృష్ట్యా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుం డా ఉండేందుకు మూడు నెలలకు సం బంధించిన రేషన్ (ఆహారభద్రతా కార్డు లు) బియ్యాన్ని ప్రభుత్వం ఒకేసారి పంపి ణీ చేయనుంది. ఇందుకోసం జిల్లా యంత్రాంగం తగిన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల తో రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు జిల్లా అధికారులను సమాయత్తం చే సింది. జూన్, జూలై, ఆగస్టు నెలల రేషన్ బియ్యాన్ని జూన్ 25లోగా పంపిణీ చేసే లా ప్రణాళికలు రూపొందించింది. ఈ మేరకు ఆన్‌లైన్ అలాట్‌మెంట్ ఇచ్చింది.
జిల్లాలో మొత్తం 515 రేషన్ దుకాణాలున్నా యి. జిల్లాలో మొత్తం 2,18,963 రేషన్‌కార్డులున్నాయి. ఇటీవల ప్రభుత్వం నూతనంగా రేషన్‌కార్డులను జారీచేసింది. జిల్లాలో మొత్తం 1,640 వరకు కొత్త కార్డులను మంజూరు చేసింది. అయితే ప్రభుత్వం ఏప్రిల్ నెల నుంచి రేషన్‌కార్డుదారులకు సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తోంది. ఈనేపథ్యంలో జిల్లాలోని యూనిట్లకు సరిపడా సన్న బియ్యం అందుబాటులో ఉన్నాయా? ఎంత వరకు సేకరించాల్సి ఉంటుందన్న సమగ్ర సమాచారాన్ని సేకరిస్తోంది. జిల్లాలో మూడు నెలల బియ్యాన్ని పంపిణీ చేయాలంటే 13,51 7.796 మెట్రిక్ టన్నుల మేరకు బియ్యం అవస రం. ఈ నేపథ్యంలో రేషన్‌షాపుల వారీగా ఎంత మేరకు బియ్యాన్ని సరఫరా చేయాలన్న అంశంపై అధికారులు లెక్కలు తీస్తున్నారు. జిల్లాలోని పలు గోదాముల్లో నిల్వ ఉన్నవాటితోపాటు ఇంకా ఎంత మేరకు బియ్యం అవసరమవుతాయో అధికారులు అంచనా వేస్తున్నారు. నెలకు దాదాపు 4400 మెట్రిక్ టన్నుల బియ్యం రేషన్‌కార్డుదారులకు పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో జిల్లాలో మూడు నెలలకు సరిపడా బియ్యం 13,517మెట్రిక్ టన్నులను రేషన్ షాపుల్లో అందుబాటులో ఉంచాలి. ప్రభుత్వం ప్రస్తుతం సన్న బియ్యం పంపిణీ చేస్తుండటంతో లబ్ధిదారుల నుం చి డిమాండ్ పెరిగింది. రేషన్ దుకాణాల్లో సైతం మూడు నెలలకు సరిపడా నిల్వలు ఉంచడానికి స్థలం ఉందా? అనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. నిల్వకోసం గదులు అద్దెకు తీసుకుంటారా? లేక విడతల వారీగా బియ్యం పంపిణీ చేయాలా? అన్నదానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.
పొరుగుజిల్లాల నుంచి బియ్యం దిగుమతి
జిల్లాలో రేషన్‌కార్డుదారులకు పంపిణీకి సరిపడా సన్న బియ్యం నిల్వలు లేవు. ఈ నేపథ్యంలో పొరుగున ఉన్న జనగాం, వరంగల్, నల్లగొండ జిల్లాల నుంచి బియ్యాన్ని దిగుమతి చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇందుకు సంబంధించి ఈ నెల 24వ తేదీ నుంచి రేషన్‌షాపులకు బియ్యం సరఫరా ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేశారు. రేషన్ కార్డుదారులకు జూన్ 25వ తేదీ నుంచి మూడునెలలకు సంబంధించిన బియ్యాన్ని ఒకేసారి సంబంధిత రేషన్ షాపుల ద్వారా పొందేలా తగిన ప్రణాళికలు రూపొందించారు.
మూడునెలల బియ్యం ఒకేసారి పంపిణీ :జి.వీరారెడ్డి, అదనపు కలెక్టర్ రెవెన్యూ
ప్రభుత్వ ఆదేశాల మేరకు రేషన్‌కార్డుదారులకు ఒకేసారి మూడు నెలల బియ్యాన్ని పంపిణీ చేయాలి. జిల్లాకు మూడు నెలలకు సన్న బియ్యం 13,517 మెట్రిట్ టన్నులు అవసరం. జిల్లాలో సరిపడా బియ్యం నిల్వలు లేవు. పొరుగున ఉన్న జనగాం, వరంగల్, నల్లగొండ జిల్లాల నుంచి దిగుమతి చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ నెల 24నుంచి అన్ని రేషన్‌షాపులకు సన్నబియ్యం తరలిచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. జూన్ 25వ తేదీ నుంచి సన్న బియ్యం రేషన్‌కార్డుదారులకు పంపిణీ చేయనున్నాం. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం.
జిల్లాలో పంపిణీ ఇలా...
మండలం రేషన్ బియ్యం పంపిణీ
కార్డులు (మెట్రిక్‌టన్నుల్లో)
అడ్డగూడూరు 7985 460
ఆలేరులో 12856 750
ఆత్మకూరు(ఎం) 8446 502
భువనగిరి 14959 920
భువనగిరి మునిసిపాలిటీ 12581 794
బీబీనగర్ 13073 829
బొమ్మలరామారం 9710 634
చౌటుప్పల్ 19309 1257
గుండాల 9146 562
మోటకొండూరు 7264 422
మోత్కూరు 9464 570
తుర్కపల్లి 9124 594
నారాయణపురం 13641 834
భూదాన్‌పోచంపల్లి 13112 867
రాజాపేట 11178 670
రామన్నపేట 15913 960
వలిగొండ 17241 1043
యాదగిరిగుట్ట 13964 841
మొత్తం 2,18,963 13,517.796