ఎవరికీ పట్టని ఈ-నామ్
ABN , Publish Date - Jun 24 , 2025 | 12:35 AM
రైతు ఉత్పత్తులను జాతీయస్థాయిలో క్రయవిక్రయాలు నిర్వహించాలని 2016లో కేంద్ర ప్రభుత్వం తిరుమలగిరి, సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లను ఈ-నామ్‌కు ఎంపిక చేసింది.
మార్కెట్‌లో మాన్యువల్‌గా తక్‌పట్టీలు
కమీషనదారుల ఇష్టారాజ్యం
అధికారుల నామమాత్రపు సూచనలు
అదనంగా 50 పైసలు కమీషన
సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌లో ఈ-నామ్ విధానం అమలవుతుందా అనే సందేహం రైతుల్లో వ్యక్తమవుతోంది. ఆనలైన విధానం వచ్చినా కమీషన దారులు నిబంధనలకు విరుద్ధంగా కమీషన తీసుకుంటున్నా అడ్డుకునే వారేలేరని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- (ఆంధ్రజ్యోతి-భానుపురి)
రైతు ఉత్పత్తులను జాతీయస్థాయిలో క్రయవిక్రయాలు నిర్వహించాలని 2016లో కేంద్ర ప్రభుత్వం తిరుమలగిరి, సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లను ఈ-నామ్‌కు ఎంపిక చేసింది. 2017 నుంచి సూర్యాపే ట మార్కెట్‌లో అమలుకు ఒక్కో అడుగు వేసింది. పరికరాలు అమర్చడం, మార్కెట్ సిబ్బందికి, కమీషనదారులకు ఆనలైనలో ఎలా వ్యవసాయ ఉత్పత్తులను క్రయవిక్రయాలు జరపాలని అవగాహనలు కల్పించా రు. ఈ-నామ్ విధానం పూర్తి స్థాయిలో వినియోగంలోకి రావడానికి ఏళ్లు పట్టింది. ఇంకా కొంతసమయం పడుతుందని మార్కెట్ సిబ్బంది చెబుతున్నారు. సూర్యాపేట మార్కెట్‌కు రైతులు వ్యవసాయ ఉత్పత్తు లు తీసుకువస్తే ఈ-నామ్(ఆనలైన)లో గేట్ ఎంట్రీ, ఎగ్జిట్, లాట్ నెంబర్లు కేటాయింపు ఆనలైనలో నమో దు చేసి రైతులకు తక్‌పట్టిలు ఇవ్వాల్సి ఉంది. ఇవి వచ్చే వరకు సమయం పడుతోందని కమీషనదారులను మ్యానువల్‌గా ఇవ్వాలని అప్పటి మార్కెట్ సిబ్బంది సూచించినట్లు సమాచారం.
తక్కువ కమీషన వస్తుందని
నిబంధనల ప్రకారం రైతులకు ఆనలైన తక్‌పట్టి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే కమీషనదారులకు రూ.100 ఉత్పత్తులకు రూ.2 కమీషన తీసుకోవాలని నిబంధన ఉంది. హమాలీలు, దడవాయి, డబ్బావాలాలు, స్వీపర్లకు కలిపి 65 కిలోల బస్తాకు రూ.30.25 కమీషన తీసుకోవాలని నిబంధన ఉంది. అయితే కమీషనదారులు తమకు నష్టం కలుగుతోందని, ఖర్చులు పెరిగాయని అనధికారికంగా క్యాష్‌కటింగ్ పేరుతో 50 పైసలు అదనంగా వసూళ్లు చేయడం మొదలుపెట్టా రు. అయితే ఈ విధానం నాలుగేళ్లుగా సాగుతున్నా పాలకులు, అధికారులు నియంత్రించలేకపోయారు. అయితే ఈ-నామ్ తక్‌పట్టిల్లో కమీషన రూ.2 కనిపిస్తోందని, రైతులకు నేరుగా తక్‌పట్టిలు ఇస్తే కమీషనదారులను రైతులు నిలదీస్తారని కంప్యూటర్ తక్‌పట్టి లు ఇవ్వకుండా మ్యానువల్‌గా కొన్నేళ్లుగా ఇస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఆనలైన తక్‌పట్టీలు ఇవ్వాలని మార్కెట్ సిబ్బంది ఆదేశించినా కమీషనదారుల్లో మార్పు రావడం లేదని సమాచారం. ఇదిలా ఉండ్డగా తక్‌పట్టికల పుస్తకాలను రూ.100లకు కమీషనదారులు కొనుగోలు చేసి తక్‌పటిక్టలను రైతులకు ఇవ్వాలని మార్కెట్ సిబ్బంది నిబంధన పెట్టారు. అయినప్పటికీ కమీషనదారులు మాత్రం నిబంధనల కు విరుద్దంగా వసూలు చేసే రూ.50 పైసలు తమకు రాకుండా పోతాయని అమలుచేయడం లేదు. మరికొందరు కంప్యూటర్ తమకు రాదని, 60 ఏళ్లు పైబడిన కమీషనదారులం ఉన్నామని సాకులు చెబుతూ ఆనలైన తక్‌పట్టిలు రైతులకు ఇవ్వకుండా మ్యానువల్ తక్‌పట్టిలు ఇస్తున్నట్లు రైతులు చెబుతున్నారు.
కమీషనదారులు ఖచ్చితంగా తక్‌పట్టికలు ఇవ్వాలి
కమీషనదారులు ఖచ్చితంగా రైతులకు ఆనలైన తక్‌పట్టిలు ఇవ్వాలి. మ్యానువల్ తక్‌పట్టిలు ఇవ్వవద్దని నిర్ణయించాం. కమీషనదారులు కంప్యూటర్లు లేకపోతే కొనుగోలు చేసుకుని ఆనలైన తక్‌పట్టిలు ఇవ్వాలి. క్యాష్‌కటింగ్ చేస్తున్నట్లు మా దృష్టికి రాలేదు.
- సంతో్‌షకుమార్, సూర్యాపేట మార్కెట్ కార్యదర్శి