స్థానిక ఎన్నికలు నిర్వహించే దమ్ము లేదు
ABN , Publish Date - Aug 16 , 2025 | 01:06 AM
కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే దమ్ము లేదని డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలో బీఆర్‌ఎస్ కార్యాలయాన్ని ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యతో కలిసి ప్రారంభించారు.
డీసీసీబీ మాజీ చైర్మన్ మహేందర్‌రెడ్డి
ఆత్మకూరు(ఎం), ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే దమ్ము లేదని డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలో బీఆర్‌ఎస్ కార్యాలయాన్ని ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యతో కలిసి ప్రారంభించారు. అనంతరం సాయి సేవా సమితి ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ సిబ్బంది, ఆటోడ్రైవర్లకు 50 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులను మహేందర్‌రెడ్డి, భిక్షమయ్య గౌడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహేందర్‌రెడ్డి మాట్లాడు తూ గ్రామాల్లో ప్రజాప్రతినిధులు లేక అభివృద్ధి కుంటుపడుతున్నా, ఎన్నికల పై కాంగ్రె్‌సకు చిత్తశుద్ధి లేదన్నారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో కార్మికులకు ఉపాధి పోయిందన్నారు. గ్రామాలను నిత్యం పరిశుభ్రం చేసే పారిశధ్య కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ప్రస్తుత పాలకులు ఉన్నారన్నారు. తెలంగాణ జాతిపితగా పిలువబడే కేసీఆర్‌ను నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నా సీ ఎం రేవంత్‌రెడ్డి తన విధానం మార్చుకోవాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2లక్షల ఉద్యోగాలు ఇచ్చారా? అని ప్రశ్నించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు బి.చందర్, మహిళా అధ్యక్షురాలు ఎస్.అరుణ, వై.కవిత, కె.బిక్షపతి, వై.ఇంద్రారెడ్డి, కె.హరిదీ్‌పరెడ్డి, సాయిసేవా సమితి అధ్యక్షురాలు బీసు ధనలక్ష్మి, బి.రాములు, బి.ఉప్పలయ్య, కె.వెంకన్న, జి.రమేష్, జి.దశరథ, పి.శంతన్‌రాజు, వై.మహేందర్‌రెడ్డి, జి.విశాల్, తదితరులు పాల్గొన్నారు.