వైశ్య రాజకీయ రణభేరిని విజయవంతం చేయాలి
ABN , Publish Date - Jul 16 , 2025 | 12:38 AM
నల్లగొండ టౌన, జూలై 15 (ఆంధ్రజ్యోతి) :హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన గ్రౌం డ్‌లో ఆగస్టు 3వ తేదీన నిర్వహించే వైశ్య రాజకీయ రణభేరి సభను విజయవంతం చేయాలని వైశ్య వికాస వేదిక చైర్మన కాచం సత్యనారాయణ కోరారు.
జిల్లా ఆర్యవైశ్య సంఘం భవనంలో మంగళవారం రణభేరికి సంబంధించిన పోస్టర్‌ను ఆయన ఆర్యవైశ్య సంఘం నాయకులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం కాచం సత్యనారాయణ మాట్లాడుతూ ఆర్యవైశ్యుల ఆత్మగౌరవం, హక్కుల సాధన కోసం రణభేరి నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని అన్ని మండలాల నుంచి ఆర్యవైశ్యులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సభను విజయవం తం చేయాలని కోరారు. జనాభా ప్రాతిపదికన వైశ్యులకు అన్ని రాజకీయ పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆర్యవైశ్య సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీశెట్టి శ్రీనివాస్ అధఽ్యక్షతన జరిగిన సమావేశంలో గౌరవ సలహాదారుడు కోటగిరి దైవాదీనం, బుక్కా ఈశ్వరయ్య, సం ఘం మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు నాంపల్లి భాగ్యలక్ష్మి, సంఘం అదనపు ప్రధాన కార్యదర్శి నాళ్ల వెంకటేశ్వర్లు, యామమురళి, పట్టణ అధ్యక్షుడు రేపాల భద్రాద్రి రాములు, ఓరుగంటి చాణిక్య, కొత్తమాసు ప్రభాకర్, ఉప్పల కోటయ్య, కాసం శేఖర్, సోమ చంద్రశేఖర్, కాసం శోభారాణి, గిరి పాల్గొన్నారు.