ముచ్చటగా మూడో షెడ్యూల్
ABN , Publish Date - May 09 , 2025 | 12:18 AM
భువనగిరి టౌన, మే 8(ఆంధ్రజ్యోతి): డిగ్రీ సెమిస్టర్ పరీక్షలకు ముచ్చటగా మూడో సారి మహాత్మాగాంధీ యూనివర్సీటీ (ఎంజీయూ) షె డ్యూల్‌ను విడుదల చేసింది. ఎంజీయూ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ అల్తాఫ్ హుస్సేన గురువారం షెడ్యూల్ జారీ చేశారు.
మే 14 నుంచి జూన 10 వరకు
సెమిస్టర్ పరీక్షలు
ఫీజు రీయింబర్స్‌మెంట్
బకాయిలు చెల్లించాలి
ఈ షెడ్యూల్ ప్రకారం మే 14 నుంచి జూన 10 వరకు ఒకటి నుంచి 6వ సెమిస్టర్ బ్యాక్‌లాగ్‌లు, 2, 4, 6 వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు జరగనున్నాయి. అయితే షెడ్యూల్‌లో ప్రాక్టీకల్స్ పరీక్షల ప్రస్తావన లేకపోవడంతో థియరీ పరీక్షల అనంతరం ప్రాక్టీకల్స్ పరీక్షలు నిర్వహిం చే యోచనలో యూనివర్సిటీ ఉన్నట్లు తెలుస్తోంది. పీజీ సెట్ పరీక్ష తేదీలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడైనా డిగ్రీ పరీక్షలు సజావుగా నిర్వహించాలని విద్యార్థులు కో రుతున్నారు. ప్రైవేట్ యాజమాన్యాలు తమకు రావాల్సిన పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేస్తేనే పరీక్షల నిర్వహణకు సహకరిస్తామని లేనిచో బహిష్కరిస్తామని మునుపటి వాదననే మరోమారు తెరపైకి తీసుకొస్తున్నారు. దీంతో పరీక్షల నిర్వహణ ప్రభుత్వ గోల్‌లోకి చే రింది. యాజమాన్యాల డిమాండ్ మేరకు బకాయిలను వి డుదల చేసి పరీక్షల నిర్వహణకు సహకరిస్తుందా? లేక ఇప్పటి వరకు ప్రదర్శిస్తున్న మొండి వైఖరినే కొనసాగించనుందో వేచిచూడాలి. రాష్ట్రంలోని మరో 4 యూనివర్సి టీ లు కూడా వాయిదా పడిన డిగ్రీ సెమిస్టర్ పరీక్షల రీ షెడ్యూల్‌ను విడుదల చేశాయి.
ముచ్చటగా మూడోసారి...
ఒకే విద్యా సంవత్సరంలో ఒకే విధమైన డిగ్రీ సెమిస్టర్ పరీక్షలకు ముచ్చటగా మూడోసారి షెడ్యూల్ జారీ చేయ డం ఎంజీయూ చరిత్రలో సుమారుగా ఇదే ప్రథమని ప లువురు పేర్కొంటున్నారు. మూడేళ్లుగా ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయకపోవడంతో ఎంజీ యూ పరిధిలోని 62 ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు తమకు రావాల్సిన సుమారు రూ.100 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెం ట్ బకాయిల విడుదల కోసం పరీక్షలపై బహిష్కరణాస్త్రాన్ర్ని ప్రయోగించాయి. దీంతో 2024-25 విద్యా సంవత్సరానికి ఏప్రిల్ 2 నుంచి 9వ తేదీ వరకు జరుగాల్సిన 2, 4, 6 రెగ్యులర్, 1, 3, 5 బ్యాక్‌లాగ్ ప్రాక్టికల్స్ పరీక్షలు వా యిదాపడ్డాయి. అలాగే ఏప్రిల్ 11వ తేదీ నుంచి ప్రారం భం కావాల్సిన 1 నుంచి 6 సెమిస్టర్స్ బ్యాక్‌లాగ్, 2, 4, 6 సెమిస్టర్స్ రెగ్యులర్ పరీక్షలను ఏప్రిల్ 17వ తేదీ వరకు వాయిదా వేశారు. అయినా ప్రైవేట్ యాజమాన్యాలు మె ట్టు దిగకపోవడంతో ఏకంగా మే 14వ తేదీ వరకు సెమిస్టర్ పరీక్షలను యూనివర్సిటీ వాయిదా వేసింది. ప్రైవేట్ యాజమాన్యాల బహిష్కరణాస్త్రంతో అన్ని కళాశాలల్లో ప్రాక్టికల్స్, సెమిస్టర్ పరీక్షలు నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో వాయిదా పడిన థియరీ పరీక్షలన్నింటినీ మే 14 నుంచి జూన 10వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ ముచ్చటగా మూడోసారి పరీక్షల షెడ్యూల్‌ను ప్ర కటించింది. ఇప్పుడైనా ప్రభుత్వం స్పందించి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేసి పరీక్షల నిర్వహణకు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ వి డుదలపై ప్రభుత్వ వైఖరిలో మార్పురాకుంటే మరోమారు పరీక్షలను బహిష్కరిస్తామని తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ క ళాశాలల యిజమాన్యాల అసోసియేషన రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సూర్యనారాయణరెడ్డి స్పష్టం చేశారు. దీంతో పరీక్షల నిర్వహణపై జిల్లాలోని సుమారు 25వేల మంది డిగ్రీ విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది.
మే 14 నుంచి ఎంజీయూ డిగ్రీ పరీక్షలు
నల్లగొండ టౌన : ఎంజీయూ పరిధిలోని డిగ్రీ పరీక్షలను మే 14 నుంచి నిర్వహించనున్నట్లు సీఈవో డాక్టర్ ఉపేందర్‌రెడ్డి తెలిపారు. గతంలో వాయిదా వేసిన పరీక్షల నూతన టైం టేబుల్ ను ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన, రిజిసా్ట్రర్ ఆచార్య అలువాల రవిలతో కలిసి గురువారం విడుదల చేశారు. పూర్తి వివరాలను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు ఆయన తెలిపారు.