హడలెత్తించిన దొంగలు దొరికారు
ABN , Publish Date - Mar 11 , 2025 | 11:37 PM
సూర్యాపేట జిల్లాలో ఒకే రోజు మూడు మండలాల్లో నాలుగు గంటల వ్యవధిలో ఐదు చోట్ల దొంగతనాలకు పాల్పడి హల్‌చల్‌చేసిన దొంగలు ఎట్టకేలకు దొరికారు.

సూర్యాపేట జిల్లాలో ఒకే రోజు మూడు మండలాల్లో నాలుగు గంటల వ్యవధిలో ఐదు చోట్ల దొంగతనాలకు పాల్పడి హల్‌చల్‌చేసిన దొంగలు ఎట్టకేలకు దొరికారు. వాహన తనిఖీల్లో భాగంగా గరిడేపల్లి పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.3.5 లక్షల సొత్తు, రూ.87 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.
సూర్యాపేటక్రైం, మార్చి 11 (ఆంధ్రజ్యోతి) : తాళం వేసి ఉన్న నివాసాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగలను సూర్యాపేట జిల్లా గరిడేపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.3.50లక్షల విలువైన సుమారు ఏడున్నర తులాలబంగారు ఆభరణాలు, రూ.87వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను మంగళవారం ఎస్పీ కొత్తపల్లి నర్సింహ జిల్లా పోలీస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆంధ్రప్రదేశ రాష్ట్రం గుంటూరు పట్టణానికి చెందిన టైల్స్ వర్క్ చేసే చిల్లర సురేష్, విజయవాడలోని ఇబ్రహీంపట్నం ప్రాం తానికి చెందిన సుతారీ మేస్త్రీ బత్తుల రాజు కలిసి తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతుంటారు. ఫిబ్రవరి 21వ తేదీన గరిడేపల్లి, నేరేడుచర్ల, పాలకవీడు మండలాల పరిధిలోని పలు నివాసాల్లో చోరీలకు పాల్పడ్డారు. ఆయా ఇళ్లలోని బీరువాల్లో భద్రపరిచిన నగదుతో పాటు బంగారు ఆభరణాలను చోరీచేశారు. గరిడేపల్లి పోలీ్‌సస్టేషన పరిధిలో మూడు కేసులు, నేరేడుచర్ల పరిధిలో ఒక కేసు, పాలకవీడు పరిధిలో రెండు కేసులు నమోదయ్యాయి. ఆయా కేసులకు ఎస్‌ఐలు దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా ఈ నెల 11న తెల్లవారుజామున మూడు గంటల సమయంలో సురేష్, రాజు ఇద్దరు ఒక బైక్‌పై సూర్యాపేటకు వెళ్తున్నారు. ఆ సమయంలో గరిడేపల్లి మండలంలోని పొనుగోడు క్రాస్‌రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న ఎస్‌ఐ నరేష్ వారిని ఆపి విచారించారు. వారి నుంచి సరైన సమాధానం రాలేదు. అంతేకాకుండా వారి వద్ద ఉన్న బ్యాగ్‌ను తనిఖీచేయగా బంగారు ఆభరణాలు కనిపించాయి. వాటి గురించి ఆరా తీయగా సమాధానం చెప్పకపోవడంతో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఫిబ్రవరిలో గరిడేపల్లి, నేరేడుచర్ల, పాలకీడు మండలాల పరిధిలో చోరీలకు పాల్పడినట్లు, చోరీ చేసిన బంగారు ఆభరణాల్లో కొన్నింటిని గుంటూరు పట్టణానికి చెందిన ప్లంబింగ్ పని చేసే చింత నాగేశ్వర్‌రావు వద్ద భద్రపరిచినట్లు, మిగిలిన బంగారు ఆభరణాలను సూర్యాపేటలో విక్రయించేందుకు వెళ్తున్నట్లు తెలిపారు. వెంటనే గుంటూరుకు వెళ్లి నాగేశ్వర్‌రావును అదుపులోకి తీసుకుని అతడి వద్ద ఉన్న, సురేష్, రాజు వద్ద ఉన్న మొత్తం 7.3తులాల బంగారు ఆభరణాలు, రూ.87వేల నగదు, చోరీలకు ఉపయోగించే ఇనుపరాడ్లు, బైక్‌ను స్వాధీనం చేసుకుని ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో 64 కేసుల్లో నిందితుడు
ప్రధాన నిందితుడైన సురే్‌షపై తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో 64 కేసులు ఉన్నాయని ఎస్పీ నర్సింహ తెలిపారు. కాగా గుంటూరు జిల్లా లాలాపేట్, కొత్తపేట పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన కేసుల్లో జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటకువచ్చి సూర్యాపేట జిల్లాలో చోరీలకు పాల్పడినట్లు వివరించారు. అదేవిధంగా ఏపీలోని పలు పోలీ్‌సస్టేషన్ల పరిధిలో 9కేసులు ఉన్నాయన్నారు. అంతర్రాష్ట్ర దొంగలను పట్టుకున్న పోలీసులను ఎస్పీ అభినందించారు.
మరో కేసులో దొంగ అరెస్ట్
హుజూర్‌నగర్ పట్టణానికి చెందిన భీమిశెట్టి ప్రదీప్ ఫ్లవర్ డెకరేషన పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. హుజూర్‌నగర్‌కు చెందిన భోజనపల్లి నాగేశ్వర్‌రావు తన కుమార్తె వివాహం నిమిత్తం పెళ్లి మండపం ఏర్పాటుచేయాలని పట్టణానికి చెందిన మహ్మద్ షబ్బుకు తెలిపాడు. అయితే షబ్బు ఆ పనికి ప్రదీ్‌పను పురమాయించాడు. అందులో భాగంగా ఈనెల 7న రాత్రి నాగేశ్వర్‌రావు నివాసంలోని రూ.1.5 లక్షల విలువైన 17 గ్రాముల బంగారు చైన, రూ.14వేల నగదును చోరీచేశాడు. ఈ ఘటనపై నాగేశ్వర్‌రావు పోలీసులకు ఫిర్యాదుచేశాడు. కేసు విచారణలో భాగంగా ఈ నెల 11న ప్రదీ్‌పను అదుపులోకి తీసుకుని విచారించగా చోరీ చేసింది తానేనని అంగీకరించాడు. అతడి నుంచి బంగారు చైన, నగదును స్వాధీనం చేసుకుని కోర్టుకు రిమాండ్‌కు చేస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు. దొంగలను పట్టుకున్న పోలీసులకు ఎస్పీ రివార్డులు అందజేశారు. సమావేశంలో అదనపు ఎస్పీ మేక నాగేశ్వర్‌రావు, కోదాడ డీఎస్పీ మామిళ్ల శ్రీధర్‌రెడ్డి, హుజూర్‌నగర్ సీఐ చరమందరాజు, గరిడేపల్లి, హుజూర్‌నగర్, నేరేడుచర్ల ఎస్‌ఐలు నరేష్, ముత్తయ్య, రవీందర్‌నాయక్ సిబ్బంది రామారావు, నాగరాజు, శంభయ్య, నాగరాజు ఉన్నారు.