Share News

కరెంటుకు కర్రె ఆధారం

ABN , Publish Date - May 28 , 2025 | 12:29 AM

(ఆంధ్రజ్యోతి -తిరుమలగిరి(సాగర్‌) మండలంలోని సఫావతతండాలో ఇళ్లకు విద్యుత సరఫరా అయ్యే తీగలు కిందికి వేలాడుతుండడంతో స్థాని కులు ఆందోళన చెందుతున్నారు.

 కరెంటుకు కర్రె ఆధారం

8 ఐదేళ్లుగా పట్టించుకోని విద్యుత సిబ్బంది8 ఆందోళనలో తండా వాసులు

(ఆంధ్రజ్యోతి -తిరుమలగిరి(సాగర్‌)

మండలంలోని సఫావతతండాలో ఇళ్లకు విద్యుత సరఫరా అయ్యే తీగలు కిందికి వేలాడుతుండడంతో స్థాని కులు ఆందోళన చెందుతున్నారు. జటావతసేవా వీధిలో పొడవాటి కర్ర ఆధారంగా ఇళ్లకు విద్యుత సరఫరా అయ్యే తీగలు వేలాడదీయడంతో ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని తండా వాసులు భయం గుి ప్పట్లో గడుపుతున్నారు. ఈ సమస్యపై పలుమార్లు సంబంధిత విద్యుతశాఖ అధికారులకు తెలియచేసినప్పటికీ వారు పట్టించుకోవడం లేదని తండావాసులు వి మర్శిస్తున్నారు. సుమారు 30 ఇళ్లకు విద్యుతను సరఫరా చేసేందుకు ఏడేళ్ల క్రితం సంబంధిత అధికారులు తీగలు సిబ్బంది బిగించారు. అయితే విద్యుత స్తంభాల మ ధ్య దూరం ఎక్కువగా ఉండడంతో వైర్లు కిందకు వేలాడుతున్న క్రమంలో స్థానికులు కర్రతో ఆధారంగా నిలబెట్టారు. ఈ సమస్యపై గత ప్రభుత్వ హయాంలో అధికారుల దృష్టికి తీసుకురావడంతో నాలుగేళ్ల క్రితం కొత్త స్తంభాన్ని దానికి వైర్లు బిగించకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు.

పొంచి ఉన్న ప్రమాదం

కర్ర సాయంతో వేలాడుతున్న ఈ విద్యుత తీగ పెద్ద ఎత్తున గాలిదుమారం వర్షం వచ్చినప్పుడు పలు మార్లు వీధిలో కిందకు పడిపోయిందని స్థానికులు తెలిపారు. ఈ తీగ కింద నుంచి తండావాసులు నిత్యం వెళ్తుంటారు. గతంలో గాలి వానకు తీగ తెగిపడడంతో మూగ జీవాలు కూడా మృత్యువాత పడ్డాయని తండావాసులు పేర్కొంటున్నారు. అధికారులు తక్షణమే స్పందించి తీగలను విద్యుత స్తంభానికి బిగించాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - May 28 , 2025 | 12:29 AM