మధ్యాహ్న భోజనంలో నాణ్యత మిథ్య
ABN , Publish Date - Jul 12 , 2025 | 12:24 AM
విద్యార్థులకు నాణ్యమైన పౌష్ఠికాహారం అందించేందుకు ఉద్దేశించిన మధ్యాహ్నభోజన పథకం లక్ష్యం గాడితప్పింది. నాలుగు నెలల నుంచి బిల్లులు రాకపోవడంతో సక్రమంగా భోజనం వడ్డించలేకపోతున్నామని నిర్వాహకులు చెబుతుండగా, మెనూ సక్రమంగా అమలు చేయకుండా వండివారుస్తున్నారనే అంశం ‘ఆంధ్రజ్యోతి’ పరిశీలనలో వెల్లడైంది.
పలు పాఠశాలల్లో లోపించిన మెనూ
ధరలుపెరగడంతో కోడిగుడ్లలో కోత
తక్కువ ధరకు వచ్చే కూరగాయలతోనే వంటలు
(ఆంధ్రజ్యోతి నెట్‌వర్క్) : విద్యార్థులకు నాణ్యమైన పౌష్ఠికాహారం అందించేందుకు ఉద్దేశించిన మధ్యాహ్నభోజన పథకం లక్ష్యం గాడితప్పింది. నాలుగు నెలల నుంచి బిల్లులు రాకపోవడంతో సక్రమంగా భోజనం వడ్డించలేకపోతున్నామని నిర్వాహకులు చెబుతుండగా, మెనూ సక్రమంగా అమలు చేయకుండా వండివారుస్తున్నారనే అంశం ‘ఆంధ్రజ్యోతి’ పరిశీలనలో వెల్లడైంది.
మధ్యాహ్నభోజన పథకం అమలుపై ఉమ్మడి జిల్లాలో పలుస్కూళ్లను ‘ఆంధ్రజ్యోతి’ బృందం పరిశీలించింది. కొన్ని పాఠశాలల్లో మిక్స్‌డ్ కర్రీ అంటే నాలుగైదు రకాల కూరగాయల స్థానం లో తక్కువ ధర ఉన్న కూరగాయల రకాలను రెండింటి ని ఎక్కువగా వేసి మిగిలి న ఒకటి, రెండు రకాలు వాడుతున్నారు. పప్పుచారులో పప్పుదినుసుల కంటే నీరే ఎక్కువగా ఉంటోంది. ఏజెన్సీ నిర్వాహకులు గ్యాస్‌స్టవ్ వాడకుండా కట్టెల పొయ్యిపైనే వంట చేస్తున్నారు. చిట్యాల మండలం వట్టిమర్తి జడ్పీ హైస్కూల్‌లో మెనూ అమలు కావడం లేదు. నిర్వాహకు లు సమ్మెలో ఉండటంతో కూరగాయలు తేనందున మెనూ ప్రకారం వండలేదని ఉపాధ్యాయు లు తెలిపారు. మెనూ ప్రకారం గురువారం చేసే వెజిటెబుల్ బిర్యానీ, మిక్స్‌డ్ వెజ్ కూర వండాల్సి ఉండగా, దోసకాయ పప్పుకూర, చింతపండు వేసిన చారు వడ్డించారు. వంటకు కృష్ణాజలాలు వినియోగించాల్సి ఉండగా, కనెక్షన్ ఉన్నప్పటికీ నీళ్లు రావడంలేదు. దీంతో ఫిల్టర్ నీటిని వినియోగిస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రానికి ప్రభుత్వం సరుకులు సరఫరా చేసే మాదిరిగా ప్రభుత్వ పాఠశాలలకూ సరఫరా చేస్తే మధ్యాహ్నభోజన పథకం పక్కాగా అమలవుతుందని నిర్వాహకులు పే ర్కొంటున్నారు.
ఫ దేవరకొండ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 419 మంది విద్యార్థులు ఉండగా, గురువారం 345 మంది మధ్యాహ్న భోజనానికి హాజరయ్యారు. మెనూ ప్రకారం వెజిటేబుల్ బిర్యానీ, మిక్స్‌డ్ వెజిటేబుల్ కర్రీ చేయాల్సి ఉండగా గోంగూర పప్పు, చారు వడ్డించారు. 10 నెలలుగా మధ్యాహ్న భోజనానికి బిల్లులు రావడం లేదని, దీంతో అప్పు చేసి వంట చేస్తున్నామని ఏజెన్సీ నిర్వాహకురాలు జంగమ్మ తెలిపారు. వంట గదులు, మధ్యాహ్న భోజనానికి షెడ్లు లేకపోవడంతో విద్యార్థులు మధ్యాహ్న భోజన సమయంలో వర్షం వచ్చిరా, ఈదురుగాలులు వచ్చినా ఇబ్బందులుపడుతున్నారు. కొండమల్లేపల్లి జడ్పీహైస్కూల్‌లో మెనూ ప్రకారం వంట చేసినా, వడ్డించే ప్రదేశం అపరిశుభ్రంగా ఉంది. భోజ నం వడ్డించే ప్రాంతం చెత్తతో ఇబ్బందికరంగా కనిపించింది. విద్యార్థులు చెట్ల కిందనే భోజనం చేస్తున్నారు.
ఫ మిర్యాలగూడ పట్టణంలోని బకాల్‌వాడీ పాఠశాలలో మెనూ అమలు చేస్తున్నా, పోషక విలువలు ఉండటం లేదు. మిక్స్‌డ్ వెజిటేబుల్ కర్రీలో క్యారెట్, బీట్‌రూట్, ఆలు, బఠానీ లేకపోవడం, వెజిటబుల్ బిర్యానీలో కాయగూరలేవీ లేకుం డా తాలింపేసి వడ్డించారు. ఏజెన్సీలకు సకాలంలో బిల్లు లు అందడం లేదు. పచా రీ కొట్లలో అప్పు తెచ్చి విద్యార్థులకు వండి పెడుతున్నామని, నెలల తరబడి బిల్లులు రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఏజెన్సీల నిర్వాహకులు పేర్కొన్నారు.
ఫ నల్లగొండ జిల్లా కేంద్రంలోని రామగిరి హైస్కూల్‌లో మెనూ ప్రకారం వెజిటబుల్ కిచిడీతో పాటు పప్పు, సాంబారు వడ్డించారు. వంట చేసేందుకు గ్యాస్ సదుపాయం, వంట గది లేకపోవడంతో పాఠశాల ఆవరణ లో ఆరుబయట వంట చేస్తున్నారు. వర్షం వచ్చిన రోజు ఇ బ్బందవుతోందని ఏజెన్సీ నిర్వాహకులు తెలిపారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో...
ఫ యాదగిరిగుట్ట మండలం దాతరుపల్లి ప్రభుత్వ ఉ న్నత పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సక్రమంగా అందడం లేదు. మెనూ ప్రకారంగా మిక్స్‌డ్ కర్రీ, కి చిడీ చేయాల్సి ఉండగా, నాలుగైదురకాల కూరగాయలకు బదులు మొత్తం ఆలుగడ్డలు మాత్రమే కనిపించాయి. ప ప్పుచారులో పప్పుదినుసులు కరువయ్యాయి. ఈ విషయ మై ప్రధానోపాధ్యాయుడు దామోదర్‌రెడ్డిని వివరణ కోరగా, ప్రతీ రోజు మెనూ ప్రకారంగానే పెడుతున్నామని మిక్స్‌డ్ కర్రీలో ఆలుగడ్డలు, వంకాయలు, టమోటా వేసి వండితే, వంకాయాలు, టమోటాలు కరిగిపోయాయని అందువల్లే ఆలుగడ్డ లు మాత్రమే కనిపిస్తున్నాయని, భోజనం నాణ్యతలో ఎక్క డా రాజీలేదని పేర్కొన్నారు.
ఫ బీబీనగర్ మండలంలోని జమీలాపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు మె నూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. వంకాయ, ఆలుగడ్డ, టమాటతో తయారు చేసిన కూర, సన్నబియ్యంతో వండిన భోజనాన్ని విద్యార్థులకు వడ్డించారు. హైస్కూల్‌లో మొత్తం 155మంది విద్యార్థులకు 129మంది హాజరయ్యారు. ప్రాథమిక పాఠశాలలో 46మంది విద్యార్థులకు 39మంది హా జరయ్యారు. భోజనం చేసేందుకు డైనింగ్ హాల్ నిర్మించినా వినియోగంలోకి తీసుకురావాలని విద్యార్థులు కోరుతున్నారు. బిల్లులు సరిగా రావడం లేదని, దీంతో భోజనం పెట్టాలంటే ఇబ్బందికరంగా ఉందని ఏజెన్సీ నిర్వహకులు లక్ష్మీ, బాలమ్మ తెలిపారు. అప్పుచేసి భోజనం అందిస్తున్నామని, నాలుగు నె లల కోడిగుడ్ల బిల్లులు, నాలుగు నెలల కార్మికుల వేతన బి ల్లులు పెండింగ్ ఉన్నాయని వారు తెలిపారు.
ఫ వలిగొండ మండల కేంద్రంలోని శ్రీ వేంకటేశ్వర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వంట గది శిథిలావస్థకు చేరింది. ఓ వైపు గోడకు పగుళ్లు ఏర్పడి కూలడానికి సిద్ధంగా ఉంది ఆ వంటగదిలోనే ఏజెన్సీ నిర్వాహకులు వంట చేస్తున్నారు. శిథిలావస్థకు చేరిన వంటగది విషయాన్ని విద్యార్థి సంఘం నాయకుల అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం కనపడలేదు. వర్షకాలంలో గోడ కూలే ప్రమాదం ఉంది.
ఫ బొమ్మలరామారం మండలంలోని చీకటిమామిడి ఉ న్నత పాఠశాలలో వండిన అన్నంలో రాళ్లు వస్తున్నాయని వి ద్యార్థులు తెలిపారు. అదే గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో వంటశాల లేక రెండు పాఠశాలలకు సంబంధించిన ఏజెన్సీలు జడ్పీ హైస్కూల్‌లోనే ఒకే చోట వంటలు వండుతున్నారు. అన్నం మాత్రం వేర్వేరుగా, కూరలు మాత్రం రెం డు పాఠశాలలకు కలిపి వండుతున్నారు.
షెడ్లు ఏర్పాటు చేసి బిల్లులు ఇవ్వాలి
మధ్యాహ్న భోజన బిల్లులు పది నెలలుగా రావడంలేదు. దీంతో రూ.2లక్షల వరకు అప్పు చేసి ఏజె న్సీ నిర్వహిస్తున్నాం. గదులు, షెడ్డు నిర్మాణం లేకపోవడంతో చెట్ల కిం దనే వంట చేసి విద్యార్థులకు వడ్డిస్తున్నాం. గుడ్ల బిల్లులతో పాటు మధ్యాహ్న భోజనం బిల్లులు మంజూరు చేయాలి.
- జంగమ్మ, మధ్యాహ్న ఏజెన్సీ నిర్వాహకురాలు,
దేవరకొండ ప్రభుత్వ పాఠశాల
ప్రభుత్వమే సరుకులు సరఫరా చేయాలి
అంగన్‌వాడీ కేంద్రాలకు సరప రా చేస్తున్న తరహా ప్రభుత్వ పాఠశాలలకు కూడా మధ్యాహ్న భోజనానికి సరుకులను ప్రభుత్వమే నే రుగా సరఫరా చేయాలి. అప్పుడు నాణ్యతలో ఢోకా ఉండదు. మాకు ఇప్పటి బిల్లులతో పాటు, గత ఏ డాది రెండు నెలల పెండింగ్ బిల్లులు రావాల్సి ఉంది. కోడిగుడ్ల ధరలు మార్కెట్లో ఆరు రూపాయలు ఉంటే, మాకు ఐ దు రూపాయలే చెల్లిస్తున్నారు. ప్రభుత్వం ధరలను సవరించాలి.
- మేడి హంస, రేణుకదేవి సమభావన సంఘం
అధ్యక్షురాలు, వట్టిమర్తి, చిట్యాల