పోలీసులకు దొరక్కుండా.. వాహనం వేగం పెంచి
ABN , Publish Date - Aug 21 , 2025 | 12:43 AM
చౌటుప్పల్ రూరల్, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను ఓ యువకుడు స్కూటీతో ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి.
చౌటుప్పల్ రూరల్, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను ఓ యువకుడు స్కూటీతో ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ సీఐ మన్మధకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్ మం డలం పంతంగి టోల్‌గేట్ వద్ద మంగళవారం సాయంత్రం 6.30కు ట్రాఫిక్ సీఐ విజయ్‌మోహన్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని కొత్తపేట ఎస్‌ఆర్ కాలనీకి చెందిన జాజుల విశాల్ (23) చిట్యాల నుంచి హైదరాబాద్‌కు స్కూటీపై బయలుదేరాడు. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులను చూసి వాహనాన్ని అతివేగంతో నడుపుతూ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆసి్‌ఫను ఢీకొట్టాడు. కానిస్టేబుల్‌ను ఢీకొట్టిన అనంతరం ఆ యువకుడు కిందపడిపోయాడు. తీవ్ర గాయాలకు గురైన కానిస్టేబుల్ ఆసి్‌ఫను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలు కావడంతో ఆసి్‌ఫను యశోద ఆస్పత్రికి తరలించారు. కానిస్టేబుల్ ఆసి్‌ఫకు మూడు చోట్ల కాలు విరిగింది. తలకు గాయాలయ్యాయి. యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని డ్రంకెన్ డ్రైవ్ పరీక్ష చేయగా మద్యం తీసుకోలేదని తేలింది. దీంతో పోలీసులు ఆ యువకుడి నుంచి రక్తనమూనాలను సేకరించారు. ప్రమాద దృశ్యాలు సీసీ ఫుటేజ్‌లో నమోదయ్యాయి. కానిస్టేబుల్ ఆంజనేయులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మధకుమార్ తెలిపారు.