బునాదిగాని కాల్వను పూర్తి చేయాలి
ABN , Publish Date - Jun 30 , 2025 | 12:40 AM
బునాదిగాని కాల్వను యుద్ధ ప్రతిపాదికన పూర్తిచేసి వానాకాలం పంటకు సాగునీరు అందించాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బొమ్మగాని ప్రభాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రభాకర్
వలిగొండ, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): బునాదిగాని కాల్వను యుద్ధ ప్రతిపాదికన పూర్తిచేసి వానాకాలం పంటకు సాగునీరు అందించాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బొమ్మగాని ప్రభాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మండలంలోని నర్సాపురం గ్రామంలో సీపీఐ 14వ మండల మహాసభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు ఎర్ర జెండానే భరోసా అన్నారు. పేద ప్రజలు, కష్టజీవులు, కార్మికుల పార్టీ సీపీఐ మాత్రమే అన్నారు. సుదీర్ఘ పోరాటాలు, త్యాగాలతో నిర్మితమైన ఎర్ర జెండా పార్టీకి ఎదురు లేదని, మరో వందేళ్లయినా చెక్కు చెదరకుండా అజేయంగా ఉంటుందన్నారు. సమరశీల పోరాటాలు సాగిస్తున్న సీపీఐ ఒక ప్రాంతానికో, ఒక వర్గానికో పరిమతం కాదన్నారు. అసమానతలేని సమాజ నిర్మాణమే కమ్యూనిస్టుల అంతిమ లక్ష్యమన్నారు.
సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు, జిల్లా సహాయ కార్యదర్శులు యానాల దామోదార్‌రెడ్డి, బోళ్లగాని సత్యనారాయణ, జిల్లా కార్యవర్గ సభ్యులు బోడ సుదర్శన్, బండి జంగమ్మ, ఎండీ ఇమ్రాన్, సీపీఐ మండల కార్యదర్శి పోలేపాక యాదయ్య, నాయకులు ఎలగందుల అంజయ్య, దాయకర్‌రెడి,్డ వెంకటేశం, వీరస్వామి, మహేష్, సత్యనారాయణ, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.