Share News

నేత్రానందంగా ‘ముక్కోటి’ వేడుకలు

ABN , Publish Date - Dec 31 , 2025 | 12:21 AM

జిల్లా వ్యాప్తంగా ముక్కోటి ఏకాదశి పర్వదిన వేడుకలు నేత్రానందంగా సాగాయి. వైష్ణవాలయాల్లో ఉతర్త ద్వార దర్శనాలు ఏర్పాటు చేశారు.

నేత్రానందంగా ‘ముక్కోటి’ వేడుకలు
వలిగొండ: మత్స్యగిరి గుట్టపై ముక్కోటి ఏకాదశి పర్వదినంలో ఈవో మోహనబాబు

వలిగొండ, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా ముక్కోటి ఏకాదశి పర్వదిన వేడుకలు నేత్రానందంగా సాగాయి. వైష్ణవాలయాల్లో ఉతర్త ద్వార దర్శనాలు ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయాలకు తరలి వెళ్లి, దేవదేవుడిని దర్శించుకున్నారు. వలిగొండ మండల కేంద్రంలోని హరిహరత్రిశక్తి ఆలయం, వెంకటాపురం గ్రామంలోని శ్రీమత్స్యగిరి లక్ష్మీనర్సింహాస్వామి దేవస్థానం గుట్టపైన, సుంకిశాల వైష్ణవ ఆలయాల్లో భక్తులు వేకువజాము నుంచే స్వామిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. స్వామికి అర్చనలు, అభిషేకాలు జరిపి మొక్కులను చెల్లించుకున్నారు. కార్యక్రమంలో దేవస్థానం ఈవో మోహనబాబు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

Updated Date - Dec 31 , 2025 | 12:21 AM