రైతుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం
ABN , Publish Date - May 06 , 2025 | 12:19 AM
రైతు ల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీజేపీ కిసాన్‌మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలి మధుసూదన్‌రెడ్డి అన్నా రు. సోమవారం మండలంలోని భూదాన్‌పోచంపల్లి, సీతవానిగూడెం, ముక్తాపూర్, గౌసుకొండ, శివారెడ్డిగూడెం, తదితర గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతుల సమస్య లు అడిగి తెలుసుకున్నారు.
బీజేపీ కిసాన్‌మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలి మధుసూదన్‌రెడ్డి
భూదాన్‌పోచంపల్లి, మే 5 (ఆంధ్రజ్యోతి): రైతు ల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీజేపీ కిసాన్‌మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలి మధుసూదన్‌రెడ్డి అన్నా రు. సోమవారం మండలంలోని భూదాన్‌పోచంపల్లి, సీతవానిగూడెం, ముక్తాపూర్, గౌసుకొండ, శివారెడ్డిగూడెం, తదితర గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతుల సమస్య లు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల ముందు రైతులకు కాంగ్రెస్ ధాన్యానికి మద్దతు ధర రూ.2,320తోపాటు అదనంగా రూ. 500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చిందన్నారు. నేటికీ ఆ హామీ నెరవేరలేదని అన్నారు. రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేకపోయిందన్నారు. అకాల వర్షానికి ధాన్యం తడవకుండా టార్పాలిన్లు అందించాలని డిమాండ్ చేశా రు. రైతులకు గత నాలుగు సీజన్ల నుంచి కమీషన్ ఇవ్వడం లేదన్నారు. శివారెడ్డిగూడెం గ్రామంలో కొనుగోలు కేంద్రం ఇన్‌చార్జి స్థానిక రైస్‌మిల్లర్లతో కుమ్మక్కై రైతుల ధాన్యాన్ని బీ-గ్రేడ్‌గా కేటాయిస్తున్నారని, ఈ ప్రాంతంలోని ధాన్యాన్ని పూర్తిగా ఏ-గ్రేడ్‌గా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతుల మద్దతుతో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమం లో కిసాన్‌మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్‌మోహన్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి సుర్కంటి రంగారెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్నం శివకుమార్, నాయకులు సుర్కంటి భూపాల్‌రెడ్డి, చిక్క కృష్ణ, గుండ్ల రాజుయాద వ్, మేకల చొక్కారెడ్డి, గొలనుకొండ ప్రభాకర్, భగవంత్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి మ చ్చేందర్, చిలుకల మల్లేష్, నర్సింహ, బడుగు శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.