రైతుల పాలిట శాపంగా మారిన ప్రభుత్వం
ABN , Publish Date - Mar 11 , 2025 | 12:53 AM
సీఎం రేవంతరెడ్డి ప్రభుత్వం రైతులపాలిట శాపంగా మారిందని ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని గూడుపుకుంటతండాలో ఎండిపోయిన బావులు, బోర్లను పరిశీలించి మాట్లాడారు.

ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి
పెనపహాడ్, మార్చి 10 (ఆంధ్రజ్యోతి) : సీఎం రేవంతరెడ్డి ప్రభుత్వం రైతులపాలిట శాపంగా మారిందని ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని గూడుపుకుంటతండాలో ఎండిపోయిన బావులు, బోర్లను పరిశీలించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం సకాలంలో సాగునీరు అందిస్తుందని నమ్మిన రైతులు ఎస్సారెస్పీ ఆయకట్టు కింద వేలాది ఎకరాల్లో వరి పంట సాగుచేశారని తెలిపారు. నీరు అందకపోవడంతో పొలాలు అన్ని ఎండిపోయి రైతులు నిరాశలో ఉన్నారని తెలిపారు. తిరిగి కేసీఆర్ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. అంతకుముందు బీఆర్‌ఎస్ నాయకులు భూక్య రవీందర్ తల్లి భూక్యా బంగారి ఆదివారం రాత్రి మృతి చెందడంతో ఆమె కుటుంబసభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో నిమ్మల శ్రీనివా్‌సగౌడ్, దొంగరి యుగేంధర్, నెమ్మాది భిక్షం, సీతారాంరెడ్డి, ఇంద్రసేనారావు, వెంకటేశ్వర్లు, శ్రీను, నాగు, సైదులు, లచ్చునాయక్, వెంకన్ననాయక్ తదితరులు పాల్గొన్నారు.
సంస్కృతీ, సంప్రదాయాలను భావితరాలకు అందించాలి
సూర్యాపేటఅర్బన (ఆంధ్రజ్యోతి) : దేశ సంస్కృతీ, సంప్రదాయాలను భావితరాలకు అందించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని శ్రీరాంనగర్ శ్రీవిజయాంజనేయస్వామి దేవాలయంలో 12 అడుగుల ఆంజనేయస్వామి విగ్రహాన్ని ఆవిష్కరించి, మాట్లాడారు. దేవాలయాల అభివృద్ధికి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేసిందని గుర్తుచేశారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు రంగినేని ఉపేందర్‌రావు, ఆలయ అధ్యక్షుడు మండల్‌రెడ్డి వెంకట్‌రెడ్డి, గౌరవ అధ్యక్షుడు సలిగంటి సరిత వీరేంద్ర, నాగవల్లి ప్రభాకర్, జీడి భిక్షం, దశరథ, గడ్డం ప్రతా్‌పరెడ్డి, రామారావు, బాలనాగమ్మ, వాంకుడోతు దేవిక, అర్చకులు మరింగంటి వరదాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
కంప్యూటర్ పరిజ్ఞానంతో మెరుగైన విద్య
కంప్యూటర్ పరిజ్ఞానంతో విద్యను మెరుగు పరుచుకోవచ్చని ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో బ్రైట్ చైల్డ్ ఫౌండేషన ఆధ్వర్యంలో పాఠశాలలో ఏర్పాటుచేసిన కంప్యూటర్ ల్యాబ్‌ను సందర్శించి, మాట్లాడారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు గోలి పద్మ, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.