పంటలు ఎండుతున్నా పట్టించుకోని ప్రభుత్వం
ABN , Publish Date - Mar 12 , 2025 | 12:29 AM
సాగు నీరు అందక రామన్నపేట మండలంలో పంటలు ఎండిపోతున్నాయని, కళ్ల ముందే పంటలు ఎండిపో తుంటే ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు.

మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
రామన్నపేట, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): సాగు నీరు అందక రామన్నపేట మండలంలో పంటలు ఎండిపోతున్నాయని, కళ్ల ముందే పంటలు ఎండిపో తుంటే ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి ధర్మారెడ్డిపల్లి, పిల్లాయిపల్లి, కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని అందించి, ఎండిపోతున్న ప్రతీ ఎకరాకు రూ.40వేలు నష్టపరిహారం ఇవ్వాలని డమాండ్‌చేశారు. మంగళశారం రామన్నపేట మండలం కొమ్మాయిగూడెం, శోభనాద్రిపురంలో సాగునీరు లేక ఎండిపోతున్న వరి పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు సరిగా పడక, ఉన్న కాల్వలలో నీరు రాక భూగర్భజలాలు అడుగంటి బోర్లు, చెరువులు, కుంటలు, చుక్క నీరు లేకుండా దర్శనమిస్తున్నాయని పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో రైతులు ఇబ్బంది పడకుండా పంటలకు సాగునీరు అందించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల ప్రధాన కార్యదర్శి పోషబోయిన మల్లేశం, నీల దయాకర్, కంభంపాటి శ్రీనివాస్, బొక్క మాధవరెడ్డి, మాజీ ఎంపీటీసీ సాల్వేరు అశోక్, గొరిగి నరసింహా, దోమల సతీష్ పాల్గొన్నారు.
పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి: సీపీఎం
భూగర్భజలాలు అడుగంటి ఎండిన వరి పంట పొలాల రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేవారు. కొమ్మాయిగూడెం సీపీఎం గ్రామశాఖ ఆధ్వర్యంలో ఎండిన వరి పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామం చుట్టూ పిలాయిపల్లి, ధర్మారెడ్డిపల్లి, కాళేశ్వరం కాలువలు ఉన్నా నీరు రాక భూగర్భ జలాలు అడుగంటి బోర్లు పోయక పంటలు ఎండిపోతున్నాయన్నారు. యుద్ధ ప్రాతిపదికన అధికారులు పంట నష్టం అంచనా వేసి నివారణ చర్యలు చేపట్టాలని అన్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 40వేలునష్టపరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేవారు. కార్యక్రమంలో గ్రామశాఖ సీపీఎం కార్యదర్శి శానగొండ వెంకటేశ్వర్లు, పార్టీ నాయకులు ఎర్ర రవీందర్, పొట్లచెరువు నాగయ్య, ఎర్ర కాటమయ్య, సాగర్ల శేఖర్, అంతటి నరసింహా, గుణగంట మల్లేశం, శనగొండ రాము, తిరుపాల మల్లయ్య ఉన్నారు.
రాజాపేట: ఎండి పోయిన పంటలకు నష్టపరిహారాన్ని చెల్లించాలని సీపీఐ రైతు సంఘం జిల్లా కార్యదర్గ సభ్యులు కొల్లూరి రాజయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం రాజాపేట మండలంలోని కూర్రారం గ్రామంలో సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో ఎండిపోయిన పంటలను పరిశీలించారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి చిగుర్ల లింగం, రైతులు నంద అయిలయ్య, పెంటపర్తి రవీందర్‌రెడ్డి, రజినికాంత, జంగా అంజయ్య, వీరేశం పాల్గొన్నారు.