మహిళాభ్యున్నతేప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Jul 17 , 2025 | 12:23 AM
మహిళా అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ హనుమంతరావు, ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అ న్నారు. మంగళవారం భువనగిరిలో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సం బురాల్లో వారు మాట్లాడారు. ఇందిరా మహిళాశక్తి పథకంతో మహిళలకు ఆర్థిక స్వావలంబన చేకూరుతుందన్నారు.
కలెక్టర్ హనుమంతరావు, ఎమ్మెల్యే కుంభం
భువనగిరి టౌన్, జూలై 16 (ఆంధ్రజ్యోతి): మహిళా అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ హనుమంతరావు, ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అ న్నారు. మంగళవారం భువనగిరిలో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సం బురాల్లో వారు మాట్లాడారు. ఇందిరా మహిళాశక్తి పథకంతో మహిళలకు ఆర్థిక స్వావలంబన చేకూరుతుందన్నారు. వ్యాపారవేత్తలుగా, కోటీశ్వరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఇందిరా మహిళాశక్తి క్యాంటీన్లు, పెట్రోల్ బంకులు మం జూరు, అద్దె బస్సుల నిర్వహణ, విద్యార్థుల యూనిఫాం కుట్టు పనులు ఇచ్చినట్లు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు లింకేజీ రుణాల చెల్లింపులో రాష్ట్రంలో జిల్లాను అగ్రభాగంలో నిలపడం జిల్లా మహిళల చిత్తశుద్ధిని తెలియజేస్తోందన్నారు. ఐకేపీ కేంద్రాల ద్వారా మహిళా సంఘాలు 10 లక్షల క్వింటాళ్ల ధ్యానాన్ని సేకరించి రూ.3కోట్ల కమీషన్ సాధించడం వారి వ్యాపార దక్షతకు నిదర్శనమన్నారు. ఇందిరా మహిళాశక్తి పథకంతో మహిళలకు ఆర్థిక స్వావలంబన చేకూరుతుందన్నారు. ఈ సందర్భంగా గ్రామీణ మహిళా సం ఘాలకు రూ.39.97కోట్ల విలువైన బ్యాంకు లింకేజీ రుణాలు, రూ.6.87కోట్ల విలువైన వడ్డీ లేని రుణాలు, 22 మందికి రూ.15.80 లక్షల విలువైన బీమా, రూ.10లక్షలు ప్రమాద బీమా, పట్టణ మహిళా సంఘాలకు రూ. 19.38 కోట్ల విలువైన చెక్కులను పంపిణీ చేసి అభినందించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎం.భాస్కరరావు, డీఆర్‌డీవో నాగిరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండీ.అవేజ్‌చిస్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ విజిలెన్స్ అధికారి మందడి ఉపేందర్‌రెడ్డి, మునిసిపల్ కమిషనర్ జి రామలింగం, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు రేణుక పాల్గొన్నారు.
భూభారతి దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి
మోత్కూరు, అడ్డగూడూరు: భూభారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించి, రెవెన్యూ పరంగా ఎలాంటి తప్పిదాలు లేకుండా పరిష్కరించాలని కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. బుధవారం మోత్కూరు, అడ్డగూడూరు తహసీల్దార్ కార్యాలయాలను తనిఖీచేసి భూభారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించారు. భూభారతికి వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి ఆయన పలు సూచనలు చేశారు. అంతకు ముందు మోత్కూరు మండలంలోని పాటిమట్ల, అడ్డగూడూరు మండలం వెల్దేవి గ్రామాల్లో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడారు. తహసీల్దార్ పి.జ్యోతి, డీటీ ఉపేందర్, ఎంపీడీవో బాలాజీ ఆయన వెంట ఉన్నారు.