విద్యా సదస్సును విజయవంతం చేయాలి
ABN , Publish Date - Dec 28 , 2025 | 12:37 AM
రాష్ట్రంలో విద్యారంగ పరిమాణాలు, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని టీఎ్‌సయూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ముక్కెర్ల యాదయ్య అన్నారు.
టీఎ్‌సయూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు యాదయ్య
భువనగిరి గంజ్, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విద్యారంగ పరిమాణాలు, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని టీఎ్‌సయూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ముక్కెర్ల యాదయ్య అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని రాష్ట్ర కమిటీ వస్తృతస్థాయి సమావేశం జనగాంలో జరగబోయే వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం, మౌలిక సదుపాయాలు కల్పించడం, అదేవిధంగా పెండింగులో ఉన్న ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం ఈ విస్తృత సమావేశాల్లో చర్చించి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదికను అందజేస్తామని తెలిపారు. పోరాటాలకు ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలకు ప్రణాళిక సిద్ధం చేస్తామని తెలిపారు. ఈ సదస్సుకు పలువురు ముఖ్య నాయకులు, మంత్రులు హాజరవుతారని ఆయన తెలిపారు. ఈ నెల 28, 29తేదీల్లో జనగాంలో జరిగే టీఎ్‌సయూటీఎఫ్ రాష్ట్ర విద్యా సదస్సు, రాష్ట్ర కమిటీ విస్తృత స్థాయి సమావేశాలు జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మెతుకు సైదులు, నాయకులు మమత, వెంకటాచారి, ముత్యాలు, శ్రీనివాస్, రవికుమార్, రమణరావు, కరుణాకర్ పాల్గొన్నారు.