పదేళ్ల కల ప్రజాపాలనలో నిజమైంది
ABN , Publish Date - Jul 26 , 2025 | 12:24 AM
రేషన్ కార్డులకోసం పదేళ్ల నిరీక్షణకు ప్రజా ప్రభుత్వం తో తెరపడిందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. శుక్రవారం మోత్కూరులో కలెక్టర్ హనుమంతరావుతో కలిసి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసి మాట్లాడారు. నిరుపేదలందరూ కడుపునిండా అన్నం తినాలనే గొప్ప లక్ష్యంతో తమ ప్రభుత్వం నూతన రేషన్‌కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టిందన్నారు.
తుంగతుర్తి ఎమ్మెల్యే సామేలు
మోత్కూరు, జూలై 25 (ఆంధ్రజ్యోతి): రేషన్ కార్డులకోసం పదేళ్ల నిరీక్షణకు ప్రజా ప్రభుత్వం తో తెరపడిందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. శుక్రవారం మోత్కూరులో కలెక్టర్ హనుమంతరావుతో కలిసి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసి మాట్లాడారు. నిరుపేదలందరూ కడుపునిండా అన్నం తినాలనే గొప్ప లక్ష్యంతో తమ ప్రభుత్వం నూతన రేషన్‌కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టిందన్నారు. ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణ లో తొలుత అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం తన తొమ్మిదిన్నదేళ్ల పాలనలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వకుండా ప్రజల ఆ కాంక్షలను విస్మరించిందని, అందుకే ప్రజలు గత ఎన్నికల్లో బీఆర్‌ఎ్‌సకు చరమగీతం పాడి ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారన్నారు. బునాదిగాని కాల్వకు భూసేకరణ మోత్కూరు మండ లం పాటిమట్ల వద్ద ఆగిపోయిందని, కలెక్టర్, ఆర్డీవో చొరవ తీసుకుని భూసేకరణ పూర్తి చేయాలని కోరారు.రైతులు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. బునాదిగాని కాల్వకు రూ. 267కోట్లు మంజూరు చేయించానని, కాల్వ పూర్తయి తే మోత్కూరు, అడ్డగూడూరు మండలాలు సస్యశ్యామలమవుతాయన్నారు. మోత్కూరు బీసీ హాస్టల్ వార్డెన్ జూనియర్ కళాశాల విద్యార్థులను చేర్చుకోవడం లేదన్న ఫిర్యాదులు వస్తున్నాయని, వెంటనే పరిశీలించి తగిన చర్య తీసుకోవాలని వేదికపైన ఉన్న బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి యాదయ్యకు సూచించారు. కలెక్ట ర్ మాట్లాడుతూ అర్హులైన ప్రతీ ఒక్కరికి రేషన్ కార్డు అందుతుందని, ఇది నిరంతర ప్రక్రియ అన్నారు. రెండు నెలల్లో బునాదిగాని కాల్వకు భూసేకరణ పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు.
ఇల్లు, రేషన్ కార్డు వచ్చింది
లబ్ధిదారుల నుంచి మండలంలోని అనాజిపురానికి చెందిన వల్లందాసు మమత మాట్లాడు తూ ఐదేళ్ల క్రితం భర్త మృతి చెందాడని, బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో డబుల్‌బెడ్ రూమ్, రేషన్ కార్డు కోసం పలుమార్లు దరఖాస్తు చేసుకున్నా రాలేదన్నారు. ప్రజా ప్రభుత్వంలో ఒక్కసారి దరఖాస్తు చేసుకోగానే ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్‌కార్డు వచ్చిందన్నారు. ఎన్‌ఎ్‌ఫబీఎ్‌స కింద రూ.20వేలు వచ్చాయన్నారు.