రేషన్‌కార్డుల కల నెరవేరింది
ABN , Publish Date - Jul 19 , 2025 | 12:48 AM
పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రాని రేషన్ కార్డులు, కాం గ్రెస్ ప్రభుత్వంలో అందజేసి పేదల కల నెరవేరుస్తున్నామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిల య్య అన్నారు.
ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య
యాదగిరిగుట్ట రూరల్, జూలై 18, (ఆంధ్రజ్యోతి): పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రాని రేషన్ కార్డులు, కాం గ్రెస్ ప్రభుత్వంలో అందజేసి పేదల కల నెరవేరుస్తున్నామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిల య్య అన్నారు. శుక్రవారం పట్టణంలో ఆలేరు నియోజకవర్గవ్యాప్తంగా మంజూరైన రేషన్‌కార్డులను లబ్ధిదారుల కు అందజేసి మాట్లాడారు. సంక్షేమ పథకాలన్నింటికీ మూలమైన రేషన్‌కార్డులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్రం వస్తే బతుకులు బాగుపడతాయని నమ్మించి మోసం చేసిన గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్కరేషన్‌కార్డు ఇవ్వలేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా 5.60లక్షల నూతన రేషన్‌కార్డులు ఇస్తున్నట్లు తెలిపారు. ఇందిర మ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇసుక, సిమెంట్, ఇనుము, ఇత ర సామగ్రి తక్కువ ధరలకు అందిస్తున్నామని, ఇప్పటికీ నియోజకవర్గంలో సుమారు 2500 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు దాదాపు పూర్తయ్యాయని చెప్పారు. కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు పండుగ వాతావరణంలో అమలవుతున్నాయన్నారు. మహిళలకు మొదటి ప్రాధాన్యం ఇచ్చి ఆర్థిక బలోపేతానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు.
అదనపు కలెక్టర్(రెవెన్యూ) వీరారెడ్డి మాట్లాడుతూ ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తులో భాగంగా అర్హులైన ప్రతీ ఒక్కరికి రేషన్‌కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కార్యక్రమంలో మదర్‌డైరీ చైర్మన్ మధునూదన్‌రెడ్డి, మార్కెట్ చైర్మన్ అయినాల చైతన్యరెడ్డి, మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మంగ సత్యనారాయణ, మునిసిపల్ మాజీ చైర్మన్ ఎరుకల సుధాహేమేందర్‌గౌడ్, నీలం పద్మ, స్థానిక తహసీల్దార్ గణే్‌షనాయక్, ఎంపీడీవో నవీన్‌కుమార్, మునిసిపల్ కమిషనర్ మిర్యాల లింగస్వామి, గుడ్లపల్లి భరత్‌గౌడ్, కళ్లెం శ్రీనివా్‌సగౌడ్, బందారుప భిక్షపతిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.