మారనున్న ‘కేఎన్‌ఎం’ రూపురేఖలు
ABN , Publish Date - Jul 12 , 2025 | 12:10 AM
The changing shape of 'KNM'
మిర్యాలగూడ పట్టణంలోని కేఎన్‌ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎంతోమంది విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చింది. ప చ్చని పొలాల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న ఈ కళాశాలలో ఇటీవల నిర్వహించిన జాతీయ సెమినార్‌తో దేశవ్యాప్త గుర్తింపు పొందింది. అంకితభావంతో పనిచేసే అధ్యాపకులు, క్రమశిక్షణకు మారుపేరైన ఎన్‌ఎ్‌సఎ్‌స వలంటీర్లతో విద్యాసేవలందిస్తున్న ఈ కళాశాలకు న్యాక్-సీ హోదా దక్కింది.
- (ఆంధ్రజ్యోతి - మిర్యాలగూడ టౌన్)
కేఎన్‌ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల నాలుగు దశాబ్దాలుగా వి ద్యాసేవలందిస్తోంది. కళాశాల ఆవిర్భావం నుంచి ఉస్మానియా యూనివర్సిటీ గుర్తింపు ఉండగా, 2012లో మహాత్మాగాంధీ యూనివర్సిటీకి అనుసంధానమైంది. కశాశాలలో బీఏ, బీఎస్సీ, బీకామ్‌లలో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఏటేటా ఉత్తమ ఫలితాలు సాధిస్తూ ప్రైవేట్ కళాశాలలకు ధీటుగా నిలుస్తోన్న ఈకళాశాలలో తరగతి గదులనిర్మాణం శరవేగంగా జరుగుతోంది.
పీఎం ఉషా నిధులతో..
ఉన్నత విద్యను ప్రోత్సహించేందుకు కేంద్రం రూపొందించిన ప్రధాన మంత్రి ఉచ్చతర్ శిక్షా అభియాన్(ఉషా) పథకం రూ పొందించింది. ఇందులో భాగంగా కళాశాల పూర్తిస్థాయిలో అభివృద్ధి కానుంది. విశాలవంతమైన తరగతి గదులు, డిజిటల్ లైబ్రరీ, కాన్ఫరెన్స్ రూమ్, యోగాహాల్, టాయ్‌లెట్స్ నిర్మాణ పనులు పూర్తి కానుండగా గుంటూరు హైవే నుంచి కళాశాలకు సీసీ రోడ్డు ఏర్పాటు చేస్తున్నారు.
అదనపు ఆకర్షణగా..
ఎస్‌సీసీ, ఎన్‌ఎ్‌సఎ్‌స ప్రోగ్రామ్స్ కళాశాలకు అదనపు ఆకర్షణగా నిలుస్తున్నాయి. గతేడాది దేశ రాజధానిలో నిర్వహించిన పంధ్రాగష్టు వేడుకల్లో కళాశాల ఎన్‌ఎ్‌సఎ్‌స వాలంటీర్లు పాల్గొనగా, నాటి ప్రోగ్రామ్ ఆఫీసర్ నర్సింగ్ కోటయ్య కంటింజెంట్ లీ డర్‌గా వ్యవహరించారు. ఇక డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్టడీ సెంటర్‌గా దూర విద్యా సేవలనందిస్తున్న కేఎన్‌ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు పీజీ సెట్‌లలో అత్యుత్తమ ర్యాంకులు సాధిస్తుండగా, పలువురు విద్యార్థులు క్రీడల్లో రాణిస్తూ కళాశాలకు గుర్తింపు తెస్తున్నారు.