Share News

మారనున్న పేట రూపురేఖలు

ABN , Publish Date - Jul 01 , 2025 | 11:57 PM

ఎప్పటి నుంచో పట్టణ ప్రజలు ఎదురుచూస్తున్న అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి.

 మారనున్న పేట రూపురేఖలు
జిల్లా కేంద్రంలో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ పనుల కోసం తవ్విన రోడ్డు

ఎప్పటి నుంచో పట్టణ ప్రజలు ఎదురుచూస్తున్న అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. అమృత 2.0 పథకం కింద చేపట్టిన ఈ పనులకు కేంద్ర వాటా 33, రాష్ట్ర వాటా 67 శాతం కింద రూ.316 కోట్లు మంజూరు చేశాయి. గతంలో 40 కిలోమీటర్ల మేర అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ ఉండగా తాజాగా 290 కిలోమీటర్ల పనులు చేపట్టారు. ఈ పనులు పూర్తయితే పట్టణమంతా అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ అందుబాటులోకి వస్తుంది. 2026 మార్చి లోపు పనులు పూర్తిచేయాల్సి ఉంది.

- (ఆంధ్రజ్యోతి, సూర్యాపేట)

పట్టణంలోని భగతసింగ్‌ నగర్‌, చర్చి కాంపౌండ్‌, జాకీర్‌హుస్సేననగర్‌లో పనులు పూర్తయ్యాయి. ప్రస్తు తం విద్యానగర్‌,శ్రీరాంనగర్‌, ఇందిరమ్మకాలనీ, 60ఫీట్ల రోడ్డులో పనులు జరుగుతున్నాయి. ఆరు అంగుళాల నుంచి రెండు అడుగుల వెడల్పు గల పైప్‌లైన్లు వేస్తున్నారు. పట్టణమంతా 10వేల మ్యానహోల్స్‌ నిర్మించనున్నారు. 30 నుంచి 40 అడుగుల మధ్య ఒక మ్యానహోల్‌ ఉండనుంది. ప్రతీ ఇంటి నుంచి వచ్చే మురుగునీరు, వాడే నీటిని అందులోకి మళ్లిస్తారు. ఈ నీటి ని పుల్లారెడ్డి చెరువులో, నల్లచెరువులోని ఎస్‌టీపీ ప్లాంట్లకు కలుపుతారు. ఇక్కడ మురుగునీటిని సీవరే జ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లలో శుభ్రం చేస్తారు. ప్రతి రోజూ ప్రతీ ప్లాంట్‌ నుంచి 10 ఎల్‌ఎండీల నీరు శుభ్రపడుతుంది. ఈ నీటిని గడ్డి పెంచడానికి, చెట్లకు, పచ్చదనం కోసం వినియోగిస్తారు. ప్రస్తుత పనులకు 20 ఎక్స్‌కవేటర్లను వినియోగిస్తున్నారు. పబ్లిక్‌ హెల్త్‌ శాఖ ద్వారా పనులు జరుగుతున్నాయి.

అండర్‌ డ్రైనేజీతో లాభాలు

ప్రస్తుత ఓపెన డ్రైనేజీలో చెత్త పేరుకుపోయి దో మలకు నిలయంగా మారింది. వర్షాకాలం వచ్చిందం టే దోమలకు నిలయాలుగా డ్రైనేజీలు మారాయి. డ్రై నేజీలు తీసేందుకు అనేకమంది మునిసిపల్‌ సిబ్బంది విని యోగిస్తున్నారు. అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణం తో దోమలు వృద్ధి చెందవు, అంతేకాక దుర్వాసన రాదు. ఏదైనా చెత్తాచెదారం పేరుకుపోతే మ్యానహోల్స్‌ ద్వారా తీస్తారు. కాల్వలు తీసే మునిసిపల్‌ సిబ్బందిని ఇతర పనులకు కేటాయించే అవకాశం ఉంది.

పనులతో ఇబ్బందులు

పైప్‌లైన్ల కోసం రహదారులపై గుంతలు తవ్వడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూడురోజులుగా జల్లులు కురవడంతో రోడ్లు బురదమయంగా మారాయి. ఆయాచోట్ల బైక్‌పై కూడా ప్రయాణించే పరిస్థితి లేదు. రాత్రి పూట వాహనదారులు కింద పడుతున్నారు. కనీసం నడిచే పరిస్థితి లేదని ప్రజలు వాపోతున్నారు. కంకరపొడి వేసి రోడ్డును సరిచేయాలని కోరుతున్నారు.

నడవలేక పోతున్నాం

అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ పనులతో వీధుల్లో నడవలేకపోతున్నాం. గుంతలు తవ్విన వీధుల్లో వెంటనే ఎక్స్‌కవేటర్‌తో సమం చేయాలి. శ్రీరాంనగర్‌లో నెలరోజులుగా తవ్వకాలు జరిపి వదిలేశారు. దీని మూలంగా ద్విచక్రవాహనదారులు ప్రతిరోజూ ప్రమాదాలకు గురవుతున్నారు. చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది.

- ఎర్ర అఖిల్‌కుమార్‌, స్థానికుడు

వీలైనంత త్వరగా పూర్తిచేస్తాం

అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణ పనులువీలైనంత త్వరగా పూర్తిచేస్తాం. పనులు జరిగే చోట మట్టిని సమాంతరం చేసి కంకర పొడి వేసే ఏర్పాటుచే స్తాం. పనులు పూర్తయిన తర్వాత రోడ్లను నిర్మి స్తాం. ప్రజలు కూడా సహకారం అందించాలి.

- గిలకత్తుల సత్యనారాయణ, ఈఈ, పబ్లిక్‌హెల్త్‌

Updated Date - Jul 01 , 2025 | 11:57 PM