సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాన్ని ఉధృతం చేయాలి
ABN , Publish Date - Oct 08 , 2025 | 12:31 AM
గాజాపై ఇజ్రాయిల్, అమెరికా చేస్తున్న దాడులను వ్యతిరేకిస్తూ బలమైన సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాన్ని ఉధృతం చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిడాల భిక్షపతి కోరారు.
ఆలేరు, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): గాజాపై ఇజ్రాయిల్, అమెరికా చేస్తున్న దాడులను వ్యతిరేకిస్తూ బలమైన సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాన్ని ఉధృతం చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిడాల భిక్షపతి కోరారు. న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో మంగళవారం అలేరులోని అంబేడ్కర్ విగ్రహం వద్ద చేపట్టిన పాలస్తీనా సంఘీభావ ప్రదర్శన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మాతృభూమి స్వేచ్ఛ కోసం పాలస్తీనా ప్రజలు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావాన్ని వ్యక్తం చేస్తూ ప్రపంచ శాంతి వర్థిల్లాలని నినాదంతో ముందుకు సాగాలని కోరారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్, అమెరికా సామ్రాజ్యవాదాన్ని మట్టి కరిపించాలని అన్నారు. చమురు నిక్షేపాలను, సంపదను, వనరులను కొల్లగొట్టుకుపోవడానికి అమెరికా ఇప్పటికే అనేక దేశాలపై దురాక్రమణలకు పాల్పడిందని, నేడు పాలస్తీనాపై ఇజ్రాయిల్ ద్వారా మహిళలను పసిపిల్లలను ఎంచుకొని కిరాతకంగా హత్యలు చేస్తోందని అన్నారు. కార్యక్రమంలో నాయకులు ఆర్. జనార్ధన, సోమయ్య, సహదేవ్, కల్లెపు అడివయ్య, పద్మ సుదర్శన, గడ్డం నాగరాజు, బాలమల్లేష్, కొమరయ్య, నర్సింహారెడ్డి, అంజయ్య, సాయిరాం, మురళి, సిద్దులు, ఉదయ్, రాందాస్ పాల్గొన్నారు.