Share News

మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం

ABN , Publish Date - Jun 10 , 2025 | 12:40 AM

రాష్ట్రంలో కోటి మం ది మహిళలను కోటీశ్వరులను చేయాలని కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క అన్నారు.

మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం

బడిబాటను సక్రమంగా నిర్వహించాలి.: మంత్రి సీతక్క

భువనగిరి (కలెక్టరేట్‌), జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కోటి మం ది మహిళలను కోటీశ్వరులను చేయాలని కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క అన్నారు. సోమవారం హైదరాబాద్‌ నుంచి సీఎస్‌ రామకృష్ణారావుతో కలిసి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడా రు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని మహిళా సంఘాలకు పెట్రో లు బంకులు కేటాయిస్తున్నామన్నారు. అందుకు అనువైన స్థలాలను గుర్తించాలని, ఒక బంక్‌ ఏర్పాటుతో 10 కుటుంబాలు ఆర్థికంగా ఎదుగుతాయన్నారు. అదేవిధంగా రైస్‌మిల్లులు, సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్లు, ఆర్టీసీకి అద్దె బస్సులు మహిళా సంఘాలకు కేటాయిస్తున్నామన్నారు. ఈ ఏడాది నవంబరు చివరి నాటికి ఇందిరా మహిళా శక్తి నూతన భవనాల నిర్మాణాలను గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 12న పాఠశాలలు పునఃప్రారంభం నాటికి మహిళా సంఘాల ద్వారా కుట్టిన ఏకరూప దుస్తు లు, పాఠ్య పుస్తకాలను పండగ వాతావరణంలో అందజేయాలన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న విద్య, సౌకర్యాలను విద్యార్థుల తల్లిదండ్రులకు బడిబాట ద్వారా వివరించి 100 శాతం పిల్లలు నమోదయ్యేలా చూడాలన్నా రు. నాణ్యమైన విద్యా బోధనకు వేసవి సెలవుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1.12లక్షల మంది ఉపాధ్యాయులకు ఐదు రోజుల పాటు నైపుణ్య శిక్షణ అందించామన్నారు. తొలిమెట్టు కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేయడంలో కలెక్టర్లు శ్రద్ధ వహించి తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. వీడియోకాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ హనుమంతరావు, అదనపు కలెక్టర్‌ భా స్కరరావు, సీఈవో శోభారాణి, డీఈవో కే.సత్యనారాయణ, ఆర్డీవో కృష్ణారెడ్డి, డీఆర్డీవోనాగిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 10 , 2025 | 12:40 AM