Share News

భువనగిరి ఖిల్లా రోప్‌వేకు టెండర్లు ఖరారు

ABN , Publish Date - Apr 19 , 2025 | 12:35 AM

భువనగిరి ఖిల్లా రోప్‌వే పనులకు టెండర్ల గ్రహణం వీడింది. రెండు ప్యాకేజీలుగా పిలిచిన టెండర్లలో రోప్‌వే పనులకు సంబంధించిన టెండర్లు ఖరారయ్యాయి. మిగతా పనులకు సంబంధించిన టెండర్‌కు ఈ నెల 25వ తేదీతో బిడ్ల దాఖలు గడువు పూర్తికానుంది.

భువనగిరి ఖిల్లా రోప్‌వేకు టెండర్లు ఖరారు

మిగతా పనులకు త్వరలో..

రూ.56.81కోట్ల విలువైన పనులు రెండు ప్యాకేజీలుగా విభజన

(ఆంధ్రజ్యోతి,భువనగిరి టౌన్‌): భువనగిరి ఖిల్లా రోప్‌వే పనులకు టెండర్ల గ్రహణం వీడింది. రెండు ప్యాకేజీలుగా పిలిచిన టెండర్లలో రోప్‌వే పనులకు సంబంధించిన టెండర్లు ఖరారయ్యాయి. మిగతా పనులకు సంబంధించిన టెండర్‌కు ఈ నెల 25వ తేదీతో బిడ్ల దాఖలు గడువు పూర్తికానుంది.

స్వదేశీ దర్శన్‌ 2.0కు ఎంపికైన భువనగిరి ఖిల్లా అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.100కోట్లు కేటాయించింది. ఈ మేరకు మొదటిదశలో రూ.56.81కోట్లు విడుదల కాగా, ఆ నిధులతో రోప్‌వే సహా ఇతర అభివృద్ధి పనులకు ఒకే ప్యాకేజీగా ప్రైవేట్‌ పబ్లిక్‌ పార్టనర్‌ షిప్‌ (పీపీపీ) విధానంలో రాష్ట్ర పర్యాటకశాఖ మార్చి మూడో వారంలో టెండర్లు పిలిచింది. కానీ అం చనాల రూపకల్పనలో వాస్తవికత లోపించిందనే కారణంతో కాంట్రక్టర్లు టెండర్‌ బిడ్స్‌ దాఖలు చేయలేదు. దీంతో అవే నిధులతో పనుల అంచనాల ను సవరించి రోప్‌వే ఒక ప్యాకేజీగా, మిగతా పనులను మరో ప్యాకేజీగా విభజించారు. ఈ మేరకు రోప్‌వే కోసం పిలిచిన టెండర్లను ఈ నెల 3న తెరవగా, రూ.18.05కోట్లతో కోల్‌కత్తాకు చెందిన ఏజెన్సీ ఈపనులను దక్కించుకుంది. మిగతా రూ.38.76కోట్ల వ్యయంతో చేపట్టాల్సిన ఖిల్లాపై కోట గో డ,కట్టడాల మరమ్మతులు, రెస్టారెంట్లు, ఖిల్లా ముఖద్వారం, ప్రస్తుత టికెట్‌ కౌంటర్‌ ఆధునికీకరణ తదితర అభివృద్ధి పనుల ప్యాకేజీ టెండర్‌ గడువు ఈ నెల 25తో ముగియనుంది. అయితే రాష్ట్రంలోనే మొట్టమొదటగా భువనగిరి ఖిల్లా పైకి నిర్మిస్తున్న రోప్‌వే పనులకు టెండర్లు ఖరారు కావడంతో స్థానికులతో పాటు పర్యాటక ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అంచనాల్లో తేడాలతోనే పనుల్లో జాప్యం

భారీ వ్యయంతో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న భువనగిరి ఖిల్లా అభివృ ద్ధి పనుల ప్రతిపాదనల రూపకల్పనలో తేడాలతోనే పనుల ప్రారంభంలో జాప్యం నెలకొన్నట్టు పలువురు పేర్కొంటున్నారు. స్వదేశీ దర్శన్‌ 2.0కు భువనగిరి ఖిల్లా ఎంపికైన వెంటనే పలువురు రాష్ట్ర, కేంద్ర ఉన్నతాధికారు లు పలుమార్లు ఖిల్లాను సందర్శించి చేపట్టాల్సిన పనులపై సమీక్షించి డిటై ల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ (డీపీఆర్‌) రూపొందించే బాధ్యతను ఓ ప్రముఖ ఇంజనీరింగ్‌ సంస్థకు అప్పగించారు. ఈ మేరకు ఆ సంస్థ బృందం పదుల సార్లు ఖిల్లాను సందర్శించి పలువురితో చర్చించి డీపీఆర్‌ను రూపొందించింది. ఆ డీపీఆర్‌ ఆధారంగా అధికారులు ఒకే ప్యాకేజీగా టెండర్లను పిలవగా పను ల అంచనా వ్యయాల్లో తారతమ్యాలు, సాంకేతిక కారణాలు చూపుతూ కాంట్రాక్టర్లు బిడ్లు దాఖలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో రెండో దశ లో పనులను రెండుగా విభజించి టెండర్లు పిలిచారు. దీంతో రోప్‌వే పను ల టెండర్లు ఖరారు కాగా, మిగతా పనులు టెండర్‌ ప్రక్రియలో ఉన్నాయి. అయితే రోప్‌వే నిర్మాణంలో కీలకమైన పిల్లర్స్‌ నిర్మాణానికి పనులు దక్కించుకున్న ఎజెన్సీ సాయిల్‌ టెస్టింగ్‌ ప్రక్రియను చేపట్టింది. టెండర్లు పూర్తయ్యాక పనులను అధికారికంగా ప్రా రంభిస్తారని తెలిసింది. పనుల పూర్తికి సుమారు ఏడాదిన్నర కాలం పడుతుందని అంచనా ఉంది.

Updated Date - Apr 19 , 2025 | 12:35 AM