ఎక్కడికక్కడే ఉపాధ్యాయుల సమస్యలు
ABN , Publish Date - Apr 27 , 2025 | 12:07 AM
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కాకుండా ఎక్కడికక్కడే ఉన్నాయని, ఇప్పటికే ఐదు డీఏలు, పీఆర్సీలు పెండింగ్‌లో ఉన్నాయని టీఎ్‌సయూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి అన్నారు.
నల్లగొండ టౌన, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి) : ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కాకుండా ఎక్కడికక్కడే ఉన్నాయని, ఇప్పటికే ఐదు డీఏలు, పీఆర్సీలు పెండింగ్‌లో ఉన్నాయని టీఎ్‌సయూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన ఉద్యమ తరగతులకు హాజరై, మాట్లాడారు. పెండింగ్ బిల్లులు రెండేళ్ల నుంచి ఈ కుబేర్‌లో జమ కావడం లేదని, వెంటనే విడుదల చేయాలన్నారు. శిక్షణా తరగతుల్లో ప్రభుత్వ విద్యారంగం, శాస్త్రీయ ఆలోచన, సంఘ నిర్మాణం- నిబంధనలు, సర్వీస్ లీవ్ రూల్స్ మీద చర్చిస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు పెంపునకు కృషి చేయాలని మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. హక్కులు, బాధ్యతలు రెండు నేత్రాలుగా పనిచేస్తున్న టీఎ్‌సయూటీఎఫ్ సంఘం ఉద్యమ తరగతుల్లో ప్రభుత్వ విద్యారంగాన్ని రక్షించడానికి ప్రణాళికలు రూపొందించాలన్నారు. ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాలని అందుకోసం ప్రతి ఒక్కరూ కంకణబద్ధులై పనిచేయాలన్నారు. కార్యక్రమంలో టీఎ్‌సయూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు ఎం.రాజశేఖర్‌రెడ్డి, జీ నాగమణి, జిల్లా అధ్యక్షుడు బక్కా శ్రీనివాసాచారి, ప్రధానకార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం, ఉపాధ్యక్షుడు బీ అరుణ, నర్రా శేఖర్‌రెడ్డి, కోశాధికారి వడ్త్యా రాజు, రాష్ట్ర సాంస్కృతిక కన్వీనర్ నల్ల నరసింహ, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎడ్ల సైదులు, సీహెచ అరుణ, జిల్లా కార్యదర్శులు రామలింగయ్య, శ్రీనివా్‌సరెడ్డి, నరసింహ, రమాదేవి, వెంకన్న, చిన వెంకన్న, సైదులు, మురళయ్య పాల్గొన్నారు.