కేంద్రం తీరుతో పన్నుల భారం
ABN , Publish Date - Jul 01 , 2025 | 11:57 PM
కేంద్రంలో బీజేపీ 11 ఏళ్ల పాలనలో సామాన్యులపై అధిక ధరలు, పన్నుల భారం మోపడం తప్ప సాధించిన ప్రగతి ఏమీలేదని మాజీ ఎమ్మెల్యే, సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు.
గరిడేపల్లి, జూలై 1 (ఆంధ్రజ్యోతి) : కేంద్రంలో బీజేపీ 11 ఏళ్ల పాలనలో సామాన్యులపై అధిక ధరలు, పన్నుల భారం మోపడం తప్ప సాధించిన ప్రగతి ఏమీలేదని మాజీ ఎమ్మెల్యే, సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. మంగళవారం కీతవారిగూడెంలోని ఓ ఫంక్షనహాల్‌లో నిర్వహించిన ఒక్కరోజు రాజకీయ శిక్షణా తరగతులను ఆయన ప్రారంభించి, మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ దేశాభివృద్ధి చెందిందని గొప్పలు చెప్పడం సిగ్గుచేటన్నారు. పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను లేబర్ కోడ్ పేరుతో తొలగించడం సరికాదన్నారు. ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై కార్మికులంతా ఏకమై గళం ఎత్తాలన్నారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో రేవంతరెడ్డి పాలనతో ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, షేక్ యాకుబ్, నెమ్మాది వెంకటేశ్వర్లు, వెంకటరెడ్డి, బ్రహ్మం, సైదులు, తుమ్మల సైదయ్య, అర్జున, భిక్షం, శ్రీనివాస్, మట్టయ్య, సుధాకర్, రామస్వామి, వీర రాఘవయ్య, వీరస్వామి పాల్గొన్నారు.