నెట్‌బాల్ పోటీల్లో సాగర్ విద్యార్థుల ప్రతిభ
ABN , Publish Date - May 22 , 2025 | 12:20 AM
నాగార్జునసాగర్, మే 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్రస్థాయి నెట్‌బాల్ పోటీల్లో నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ విద్యార్థులు ప్రతిభ కనబర్చారు.
నాగార్జునసాగర్, మే 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్రస్థాయి నెట్‌బాల్ పోటీల్లో నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. ఈ నెల 15, 16, 17, 18వ లేదీల్లో జనగాం జిల్లా బతుకమ్మకుంట స్టేడియంలో జరిగిన రాష్ట్రస్థాయి నెట్‌బాల్ పోటీల్లో నల్లగొండ జిల్లా జట్టు ప్రతిభ కనబర్చిందని నెట్‌బాల్ అసోషియేషన్ జిల్లా సెక్రటరీ కిరణ్‌కుమార్ తెలిపారు. బాలికల జట్టు ద్వితీయ స్థానం సాధించిందని తెలిపారు. సాగర్ సెయింట్ జోసఫ్ ఉన్నత పాఠశాల విద్యార్థులు కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు. విద్యార్థులకు సీఐ శ్రీనునాయక్, ఉమ్మడి నల్లగొండ జిల్లా కబడ్డీ అసోషియేషన్ కార్యదర్శి కర్తయ్య, పీఈటీ కిరణ్‌కుమార్ హెచ్‌ఎం సిస్టర్ లలిత, సిస్టర్ మతీనా అభినందించారు.