Share News

బెస్ట్‌ అవైలబుల్‌ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

ABN , Publish Date - Jun 25 , 2025 | 12:01 AM

సూర్యాపేట(కలెక్టరేట్‌), జూన 24, (ఆంధ్రజ్యోతి): బెస్ట్‌ అవైలబుల్‌ పథకాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌ అన్నారు.

బెస్ట్‌ అవైలబుల్‌ పథకాన్ని  సద్వినియోగం చేసుకోవాలి

కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌

సూర్యాపేట(కలెక్టరేట్‌), జూన 24, (ఆంధ్రజ్యోతి): బెస్ట్‌ అవైలబుల్‌ పథకాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ రాంబాబుతో కలిసి లాటరీ పద్ధ్దతిలో బెస్ట్‌ అవైలబుల్‌ పథకం కింద 192 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. ఈ విద్యాసంవత్సరంలో బెస్ట్‌ అవైలబుల్‌ పథకం కింద వివిధ పాఠశాలల్లో ఒకటో తరగతిలో డే స్కాలర్‌, ఐదవ తరగతిలో రెసిడెన్షియల్‌లో ప్ర వేశాలకు లక్కీ డ్రా ద్వారా విద్యార్థులను ఎంపిక చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్సీ కులాల అభివృద్ధి అధికారి దయానందరాణి, డీఈవో అశోక్‌, రెసిడెన్షియల్‌ కోఆర్డినేటర్‌ సీహెచ. పద్మ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులు పర్యావరణంపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌ అన్నారు. కలెక్టరేట్‌లో డీఈవో అశోక్‌తో కలిసి నేషనల్‌ స్టూడెంట్‌ పర్యావరణ కాంపిటీషన-2025 పోస్టర్‌ మంగళవారం ఆవిష్కరించారు. జూలై 1వ తేదీ నుంచి విద్యార్థుల కోసం పర్యావరణ క్విజ్‌ పోటీకి నమోదు ప్రారంభం అవుతుందన్నారు. ఈ పోటీల్లో ఆరవ తరగతి నుంచి డిగ్రీ చదువుతున్న విద్యార్థులతో పాటు సామా న్య పౌరులు పాల్గొనవచవ్చని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా సైన్స అధికారి ఎల్‌. దేవరాజ్‌, సెక్టోరల్‌ అధికారులు శ్రవణ్‌కుమార్‌, జనార్దన, రాంబాబు, నర్సింహారెడ్డి పాల్గొన్నారు.

విద్యార్థి దశలోనే లక్ష్యాన్ని ఎంచుకోవాలి

సూర్యాపేటరూరల్‌ : విద్యార్థి దశలోనే లక్ష్యాన్ని ఎంచుకుని ఆ దిశగా శ్రద్ధగా చదవాలని కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌ అన్నారు. మండలంలోని ఇమాంపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు, ముందుగా డైనింగ్‌ హాల్‌, వంటగదిని పరిశీలించి విద్యార్థులను మెనూ గురించి అడిగి తెలుసుకున్నారు. హాజరు పట్టికను పరిశీలించి నైట్‌ డ్యూటిలో ఉన్న సిబ్బంది వివరాలను ప్రిన్సిపాల్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంత రం కలెక్టర్‌ మాట్లాడుతూ ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు ఎంసెట్‌, నీట్‌, అలాగే పోటీ పరీక్షలకు కావాల్సిన స్టడీ మెటీరియల్‌ త్వరలోనే అందజేస్తామని తెలిపారు. కళాశాలలో త్వరలోనే ఆర్‌ఓ ప్లాంట్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాల్సిందిగా ఇంజనీరింగ్‌ అధికారులను కలెక్టర్‌ అదేశింఽఽఽచారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ సీహెచ పద్మ, వైస్‌ ప్రిన్సిపాల్‌ అనిత పాల్గొన్నారు.

Updated Date - Jun 25 , 2025 | 12:01 AM