ఆత్మగౌరవానికి ప్రతీక.. రేషన్‌కార్డు
ABN , Publish Date - Aug 22 , 2025 | 01:01 AM
రేషన్ కార్డు అనేది ప్రతీ పేదవాని ఆత్మగౌరవానికి ప్రతీక అని ప్రభుత్వవిప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. మండల కేంద్రంలో గురువారం నూతన రేషన్ కార్డుల పంపిణీని ఎమ్మెల్యే ప్రారంభించారు.
ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య
ఆత్మకూరు(ఎం), ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): రేషన్ కార్డు అనేది ప్రతీ పేదవాని ఆత్మగౌరవానికి ప్రతీక అని ప్రభుత్వవిప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. మండల కేంద్రంలో గురువారం నూతన రేషన్ కార్డుల పంపిణీని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలకు, కులాలకు, మతాలకతీతంగా అర్హులైన ప్రతీఒక్కరికి రేషన్ కార్డు అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జి.వీరారెడ్డి, ఆర్డీవో కృష్ణారెడ్డి, తహసీల్దార్ వి.లావణ్య, సింగిల్‌విండో చైర్మన్ శేఖర్‌రెడ్డి, వైస్ చైర్మన్ గంధమల్ల జహంగీర్, మాజీ జడ్పీటీసీ కె.నరేందర్, మాజీ ఎంపీపీ తండ మంగమ్మ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వై.లక్ష్మారెడ్డి, మహిళా అధ్యక్షురాలు డి.నవ్య, మాజీ సర్పంచ్ జె.నగేష్ పాల్గొన్నారు.
మునిసిపల్ భవనం పూర్తి చేయాలి
యాదగిరిగుట్ట రూరల్: యాదగిరిగుట్ట మునిసిపాలిటీ భవన నిర్మాణం ఆరు నెలల్లోపే పూర్తి చేయాలని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య ఆదేశించారు. గురువారం పట్టణంలో రూ.3.20కోట్లతో రెండు అంతస్తుల్లో నిర్మించనున్న యాదగిరిగుట్ట మునిసిపల్ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి భూమి పూజ నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ ఎరుకల సుధాహేమేందర్‌గౌడ్, మాజీ కౌన్సిలర్లు వాణీభరత్‌గౌడ్, మల్లేశ్, మౌనికశ్రీధర్, అరుణరాజేష్, సురేందర్, అనిల్, మమతసాయి, సరోజహరీష్, మాజీ కో ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.
మోటకొండూరు: మోటకొండూరు మండలానికి 928 కొత్త రేషన్ కార్డులు మంజూరయ్యాయని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య తెలిపారు. మండలకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో లబ్ధిదారులకు రేషన్‌కార్డులు అందజేసి మాట్లాడారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఆర్డీవో కృష్ణారెడ్డి, తహసీల్దార్ నాగదివ్య, ఎంపీడీవో ఇందిర, ఆలేరు మార్కెట్ వైస్ చైర్మన్ పచ్చిమట్ల మదార్‌గౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గంగాపురం మల్లేష్, రఘునాథరాజు పాల్గొన్నారు.