పర్యావరణ పరిరక్షణతోనే జీవకోటికి మనుగడ
ABN , Publish Date - Aug 09 , 2025 | 11:56 PM
కోదాడటౌన్, ఆగస్టు 9(ఆంద్రజ్యోతి): పర్యావరణ పరిరక్షణతోనే జీవకోటి మనుగడ సాధ్యమని పరిరక్షణ ఉద్యమకారుడు కొల్లు లక్ష్మీనారాయణ అన్నారు.
కోదాడటౌన్, ఆగస్టు 9(ఆంద్రజ్యోతి): పర్యావరణ పరిరక్షణతోనే జీవకోటి మనుగడ సాధ్యమని పరిరక్షణ ఉద్యమకారుడు కొల్లు లక్ష్మీనారాయణ అన్నారు. శనివారం రక్షాబంధన్ సందర్భంగా పట్టణంలోని అశోక్‌నగర్ వద్ద ప్రధాన రహదారి పక్కన ఉన్న చెట్టుకు రాఖీ కట్టారు. తొబుట్టవుల ప్రేమకు రక్షాబంధన్ కాగా మానవజీవకోటి మనుగడకు వృక్షాబంధనం ప్రతి ఇంట్లో నిర్వహించుకోవాలన్నారు. కార్యక్రమంలో సామాజిక కార్యకర్త సయ్యద్ బషీరుద్దీన్, ఆవుల శివప్రసాద్, షేక్ షరీపుద్దీన్ పాల్గొన్నారు.