Share News

క్షేత్రస్థాయిలో నిఘా ఏర్పాటు చేయాలి

ABN , Publish Date - Jul 24 , 2025 | 12:38 AM

నేరాల నియంత్రణకు క్షేత్రస్థాయిలో నిఘా ఏర్పాటుచేయడంతో పాటు నేరాల నివారణకు సమష్ఠిగా పనిచేయాలని ఎస్పీ కొత్తపల్లి నర్సింహ అన్నా రు.

క్షేత్రస్థాయిలో నిఘా ఏర్పాటు చేయాలి
విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సీసీఎస్‌ ఇనస్పెక్టర్‌ శివకుమార్‌కు రివార్డు అందజేస్తున్న ఎస్పీ కొత్తపల్లి నర్సింహ

సూర్యాపేట క్రైం, జూలై 23 (ఆంధ్రజ్యోతి) : నేరాల నియంత్రణకు క్షేత్రస్థాయిలో నిఘా ఏర్పాటుచేయడంతో పాటు నేరాల నివారణకు సమష్ఠిగా పనిచేయాలని ఎస్పీ కొత్తపల్లి నర్సింహ అన్నా రు. బుధవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో నిర్వహించిన పోలీసుల నెలవారీ నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. అత్యవసర సమయాల్లో ప్రజలు డయల్‌-100కు ఫోన చేసి పోలీస్‌ సేవలు పొందాలన్నారు. నిత్యం వాహనాలను తనిఖీలు చేయాలని, అనుమానిత వ్యక్తుల కదలికలు గమనిస్తూ రౌడీషీటర్లపై నిఘా ఉంచాలన్నారు. దొంగతనాల కేసుల్లో కేసులను ఛేదించడంతో పాటు చోరీకి గురైన సొత్తును రికవరీ చేసేలా పనిచేయాలన్నారు. కాలనీలు, దుకాణాల సముదాయాల ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకోసం ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. సైబర్‌ మోసాలు, మహిళా భద్రతపై అవగాహన కల్పించాలన్నారు. ఇటీవల జిల్లాలో గంజాయి, నకిలీ విత్తనాల పట్టివేత కేసుల్లో సీసీఎస్‌ ఇనస్పెక్టర్‌ శివకుమార్‌ బాగా పనిచేశారని, ఐజీ కార్యాలయం నుంచి వచ్చిన మెరిటోరియస్‌ సర్వీస్‌ రివార్డును అందజేసినట్లు తెలిపారు. ఉత్తమంగా విధులు నిర్వహించే పోలీసులకు అందించే రివార్డుల్లో అత్యుత్తమమైనది మెరిటోరియస్‌ సర్వీస్‌ రివార్డు అన్నారు. సమావేశంలో సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్‌, డీసీఆర్‌బీ ఇనస్పెక్టర్‌ హరిబాబు, సీసీఎస్‌ ఇనస్పెక్టర్‌ శివకుమార్‌, సీఐలు శివశంకర్‌, చరమందరాజు, రజితారెడ్డి, రంజితరెడ్డి, నాగేశ్వర్‌రావు, నర్సింహారావు, రామక్రిష్ణారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jul 24 , 2025 | 12:38 AM