Share News

నిఘా నేత్రం.. పనిచేస్తేనే ఫలితం

ABN , Publish Date - Mar 11 , 2025 | 11:36 PM

నేరాల నియంత్రణ, పరిష్కారంలో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. దొంగతనాలు, చోరీలు, చట్టవ్యతిరేక కార్యకలాపాలు, ప్రమాదాలు ఇతరత్రా నేరాల అదుపుతో పాటు ఘటన జరిగిన తీరును గమనించేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడుతున్నాయి.

నిఘా నేత్రం.. పనిచేస్తేనే ఫలితం

నేరాల నియంత్రణ, పరిష్కారంలో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. దొంగతనాలు, చోరీలు, చట్టవ్యతిరేక కార్యకలాపాలు, ప్రమాదాలు ఇతరత్రా నేరాల అదుపుతో పాటు ఘటన జరిగిన తీరును గమనించేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడుతున్నాయి. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా పోలీ్‌సశాఖ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలను ఏర్పాటుచేశారు. జిల్లాలో ఎక్కడ ఏ నేరం జరిగినా ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాల పుటేజీలను సేకరించడంలో పోలీసులు నిమగ్నమవుతున్నారు. అయితే పలుచోట్ల అవి పనిచేయడం లేదు. దీంతో కొన్ని కేసుల పరిష్కారం జటిలంగా మారుతోంది. ఆధారాల సేకరణ, నేర నిరూపణలో సీసీ టీవీ ఆధారాలు కీలకంగా మారుతున్నట్లు పోలీస్‌వర్గాల సమచారం.

- (ఆంధ్రజ్యోతి-నల్లగొండ క్రైం)

తమను ఎవరూ చూడలేదని, నేరం చేసి అక్కడి నుంచి తప్పించుకుంటున్న సందర్భంలో సీసీ కెమెరాలకు చిక్కుతూ పోలీసులకు నేర స్థులు దొరికిపోతున్నారు. నల్లగొండ జిల్లావ్యాప్తంగా పోలీస్‌ శాఖ, కమ్యూనిటీ పోలీసింగ్‌ ద్వారా సీసీ కెమెరాలను ఏర్పాటుచేయిస్తోంది. అలా ఏర్పాటుచేసిన సీసీ కెమెరాల ను కమాండ్‌ కంట్రోల్‌ రూంకు అనుసంధానం చేసి జిల్లా పోలీస్‌ కార్యాలయ సిబ్బంది నిరంతర పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో మొత్తం కమ్యూనిటీ పోలీసింగ్‌ ద్వారా 2,538 సీసీ కెమెరాలు ఏర్పాటుచేయగా అందులో 1,660 పనిచేస్తుండగా 878 మరమ్మతులకు గురయ్యాయి. అదేవిధంగా షా పింగ్‌మాల్స్‌, అపార్ట్‌మెంట్లు, ప్రధాన కాలనీలు, షాపులు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో పాటు ‘నేనుసైతం’ కార్యక్రమం ద్వారా 4,483 సీసీ కెమెరాలను ఏర్పాటుచేశారు.

ఏడాది క్రితం నల్లగొండ మండలం పెద్దసూరారం గ్రామం లో మధ్యాహ్నం ఓ ఇంట్లో చోరీ జరిగిం ది. సుమారు 8 తులాల బంగారు ఆభరణా లు చోరీ అయ్యాయి. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. ఈ ఘటనపై బాధితులు పోలీ్‌సస్టేషనలో ఫిర్యాదు చేయడంతో పోలీసులు రం గంలోకి దిగారు. పోలీసులకు ఎలాంటి ఆనవా ళ్లూ లభించలేదు. ఆ ఇంటికి సమీపంలోనే బెల్టు, కిరాణ దుకాణం వద్ద సీసీ కెమెరాలు ఉండడాన్ని గమనించిన పోలీసులు వాటిని పరిశీలించారు. ఆయా కెమెరాల్లో అనుమానితులు దుకాణంలో మద్యం సేవించడంతో పాటు చోరీ చేసిన త ర్వాత కూడా ఆ సీసీ కెమెరాల వద్దకు రావడాన్ని గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా చోరీ చేసింది తామేనని అంగీకరించడంతో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

అంతర్రాష్ట్ర ముఠా ఆటకట్టు

నల్లగొండ జిల్లాలో చోరీలకు పాల్పడుతూ అమాయకులను కిరాతకంగా హత్య చేస్తున్న పార్థీ గ్యాంగ్‌ ముఠాను సైతం జిల్లా పోలీసులు సీసీ కెమెరాల సహకారంతో చాకచక్యంగా పట్టుకున్నారు. కట్టంగూరు మండలం పామనగుండ్ల సమీపంలో రోడ్డు పక్కన గూడ్స్‌ ఆటో ఆపి సేదతీరుతున్న డ్రైవర్‌ను హత్య చేసి అతడి వద్ద ఉన్న నగదును దొంగిలించి అదే మండలంలో రెండు ఇళ్లల్లో ఓ ముఠా చోరీకి పాల్పడింది. కట్టంగూరు నుంచి చిట్యాల, చౌటుప్పల్‌ వరకూ సీసీ కెమెరాల పుటేజీలను సేకరించి పోలీసులు హత్య, చోరీలకు పాల్పడుతున్న పార్థీ గ్యాంగ్‌కు చెందిన నలుగురు ముఠాగా నిర్ధారించుకుంది. వారి కదలికలను గమనించి ముఠా లీడర్‌ అప్పా పాండ్రంగాతో పాటు మిగతా నిందితులను అరె స్టుచేసి రిమాండ్‌కు తరలించారు.వారిని అరెస్టు చేయడంలోనూ సీసీ కెమెరాల పాత్ర ఎంతో ఉంది.

పర్యవేక్షణ లోపంతోనే పని చేయని సీసీ కెమెరాలు..

నిరంతరం నిఘా నీడలో ఉండాల్సిన ప్రధాన నగరాల్లో సీసీ కెమెరాలు లేకపోవడం, ఉన్నా కొన్నిచోట్ల పనిచేయకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు సీసీ కెమెరాల పుటేజీలను సమకూర్చుకుని కొన్ని కేసులను ఛేదిస్తూ కీలకంగా పనిచేస్తున్నా చిన్నా, చితక, పేదవర్గాల ప్రజలకు సంబంధించిన సెల్‌ఫోన్లు, చోరీలు జరిగిన సమయంలో ఇబ్బందులు తప్పడం లేదు. కేసులను ఛేదించేందుకు సీసీ కెమెరాలు లేకపోవడంతో అమాయక ప్రజలు, పేదలు నిత్యం పోలీసుస్టేషన్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లావ్యాప్తంగా ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలు పర్యవేక్షణ లోపంతో పని చేయడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. మరమ్మతులకు గురైన సీసీ కెమెరాలను రిపేర్‌ చేయించం వ్యయంతో కూడిన పనికావడంతో వాటిని అలాగే వదిలేస్తున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో పోలీ్‌సస్టేషన ఎస్‌హెచవోలు స్వచ్ఛంద సంస్థలను, దాతలను సంప్రదించి సీసీ కెమెరాల ఉపయోగాన్ని వివరించి వారి ద్వారా మరమ్మతులు చేయిస్తున్నారు. అయితే ఇందులో పోలీస్‌ శాఖకు సంబంధించి ప్రత్యేకంగా సాంకేతిక సిబ్బంది లేకపోవడం కూడా మరమ్మతుల్లో అలసత్వం జరుగుతోంది. పోలీస్‌ శాఖ నుంచే ప్రతీ పోలీస్‌ స్టేషన, సర్కిల్‌ పరిధిలో టెక్నికల్‌ సిబ్బందిని కేటాయిస్తే సీసీ కెమెరాల మరమ్మతులు సులభతరం అవుతాయంటున్నారు.

ప్రణయ్‌ హత్యను

ఛేదించడంలోనూ...

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మిర్యాలగూడకు చెందిన ప్రణయ్‌ పరువు హత్య కేసు మిస్టరీని ఛేదించడంలో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషించాయి. ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన ప్రణయ్‌పై వెనుక నుంచి సుభా్‌షశర్మ కత్తితో దాడి చేయడం అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. అంతేకాకుండా నిందితులు టోల్‌గేట్‌ వద్ద కారులో వెళ్తున్న దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో నమోదవడంతో పోలీసులు కేసును ఛేదించడంలో సులువుగా మారింది.

రహదారుల విస్తరణతో...

నల్లగొండ జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌తో పాటు మిర్యాలగూడ, దేవరకొండ, నకిరేకల్‌, నార్కట్‌పల్లి ఇతర ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన కొన్ని సీసీ కెమెరాలు పనిచేయడంలేదు. దీంతో ఆయా ప్రాంతాల్లో సెల్‌ఫోన, బైక్‌ చోరీలు, ఇతర నేరాలు జరిగిన సమయంలో సీసీ కెమెరాలను పరిశీలించి, నిందితులను గుర్తించడం పోలీసులకు కత్తిమీది సాములాగానే మారింది. జిల్లా కేంద్రంలో రోడ్ల మరమ్మతులు, రోడ్ల విస్తరణ సమయంలో సీసీ కెమెరాలను తొలగించి పనులుచేశారు. ఆ విస్తరణ పనులు మధ్యలోనే నిలిచిపోవడం వంటి కారణాలతో సీసీ కెమెరాలను బిగించలేదు. దీంతో ప్రమాదాలు, నేరాలు జరిగినా దుకాణాల వద్ద ఏర్పాటుచేసిన సీసీ కెమెరాల యజమానులను పోలీసులు సంప్రదించాల్సిన దుస్థితి ఏర్పడింది.

సీసీ కెమెరాలను ప్రతి చోటా ఏర్పాటు చేసుకోవాలి

నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ప్రజలు, నాయకులు, యువకుల సహకారంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి. సీసీ కెమెరాలను ఏర్పాటుతో నేరాలు జరిగిన సమయంలో నిందితులను గుర్తించే అవకాశం ఉంటుంది. సీసీ కెమెరాలు ఉన్నాయనే భయం తో నేరాలు చేసే వారు భయపడే అవకాశం ఉంది. నల్లగొండ జిల్లావ్యాప్తంగా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో 1,660 సీసీ కెమెరాలను ఏర్పాటుచేశాం. జిల్లా కేంద్రంలో ఇటీవల చర్లపల్లి బైపాస్‌ నుంచి కలెక్టరేట్‌తో పాటు కొన్ని ప్రాంతాల్లో అధునాతన కెమెరాలను ఏర్పాటుచేశాం. ఎక్కడైనా సీసీ కెమెరాలు పనిచేయకుంటే గుర్తించి మరమ్మతు చేయిస్తాం. ప్రజలు, వ్యాపారస్తులు కూడా ముందుకు వచ్చి సహ కారం అందించాలి. నేను సైతం ద్వారా కూడా పెద్దసంఖ్యలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నాం.

-శరతచంద్ర పవార్‌, నల్లగొండ జిల్లా ఎస్పీ

Updated Date - Mar 11 , 2025 | 11:36 PM