నాణ్యమైన పత్తికి మద్దతు ధర
ABN , Publish Date - Oct 24 , 2025 | 12:37 AM
నార్కట్‌పల్లి, అక్టోబరు 23,(ఆంధ్రజ్యోతి) :సీసీఐ నిబంధనల మేరకు నాణ్యమైన పత్తిని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి రైతులు మద్దతు ధర పొందాలని పత్తి కొనుగోలు జిల్లా ఇనచార్జి, రాష్ట్ర పశుసంవర్థక, వ్యవసాయ శాఖ సంచాలకుడు బీ.గోపి సూచించారు.
నార్కట్‌పల్లి, అక్టోబరు 23,(ఆంధ్రజ్యోతి) :సీసీఐ నిబంధనల మేరకు నాణ్యమైన పత్తిని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి రైతులు మద్దతు ధర పొందాలని పత్తి కొనుగోలు జిల్లా ఇనచార్జి, రాష్ట్ర పశుసంవర్థక, వ్యవసాయ శాఖ సంచాలకుడు బీ.గోపి సూచించారు. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చౌడంపల్లి వరలక్ష్మి కాటన మిల్‌ను కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఉన్నతాధికారులతో కలిసి గురువారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో ముఖాముఖి మాట్లాడారు. ఏనుగులదొరి గ్రామానికి చెందిన పన్నాల యాదగిరిరెడ్డి అనే రైతు గోపితో మాట్లాడుతూ రెండు నెలలుగా కురుస్తున్న వర్షాలతో పత్తిలో తేమశాతం బాగా ఉందని, రోజుల తరబడి ఆరబెట్టినా వాతావరణం దృష్ట్యా 12 శాతం తేమ వచ్చేలా లేదన్నారు. తేమ శాతాన్ని 15కు పెంచాలని కోరారు. దీంతో ఆయన స్పందించి తేమ శాతం పెంచడమనేది కేంద్రం ప్రభుత్వ పరిధిలోని సీసీఐ అంశమని చెప్పారు. అంతకు ముందు కాటన మిల్ కార్యాలయంలో జిల్లా ఉన్నతాధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. జిల్లా వ్యవసాయ శాఖ తరఫున ఓ అధికారిని జిన్నింగ్ మిల్లుల వద్ద పర్యవేక్షణకోసం నియమించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, సబ్‌కలెక్టర్ అమిత నారాయణ, ఆర్డీవో యానాల అశోక్‌రెడ్డి, వ్యవసాయ, పశుసంవర్థక శాఖ జేడీ శ్రవణ్ కుమార్, డీఆర్‌డీఏ పీడీ శేఖర్‌రెడ్డి, మార్కెటింగ్ ఏడీ ఛాయాదేవి, వరలక్ష్మీ కాటన మిల్ యజమాని శ్రీధర్‌రెడ్డి, తహసీల్దార్ ఎల్.వెంకటేశ్వర్‌రావు, ఏవో గౌతమ్ పాల్గొన్నారు.
కపాస్ కిసాన యాప్‌పై అవగాహన కల్పించాలి
సూర్యాపేటరూరల్ : రైతులకు కపాస్ కిసాన యాప్‌పై అవగాహన కల్పించాలని రాష్ట్ర పశుసంవర్థక, వ్యవసాయ శాఖ సంచాలకుడు బీ.గోపి అన్నారు. సూర్యాపేట మండలం బాలెంలలోని మంజిత పత్తి మిల్‌ను సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్‌తో కలిసి పరిశీలించారు. ఈ సంద్భంగా మాట్లాడుతూ కాపాస్ కిసాన యాప్ ద్వారా రైతులు స్లాట్ బుక్ చేసుకుని పత్తిని విక్రయించుకోవాలని సూచించారు. స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలో వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని అదేశించారు. రైతులు తమ ఫోన నంబర్లు ఆప్‌డేట్ చేసుకోవాలని తెలిపారు. అనంతరం బాలెంల రైతు వేదికలో వ్యవసాయ అధికారులతో యాంత్రీకరణ, ఎరువుల నిల్వలు, వ్యవసాయ శాఖ పథకాలు, రైతులకు అందించే సబ్సిడీలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. డీఏవో శ్రీధర్‌రెడ్డి, మార్కెటింగ్ అధికారి నాగేశ్వరవర్మ, ఏవో కృష్ణసందీప్ పాల్గొన్నారు.
గాలి వ్యాధి నివారణ శిబిరం ప్రారంభం
చిట్యాలరూరల్ : పశువులకు గాలికుంటు వ్యాఽఽధి రాకుండా టీకాలు వేయించాలని రాష్ట్ర పశువైద్య, పశుసంవర్ధకశాఖ సంచాలకుడు డాక్టర్ బి. గోపి అన్నారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లిలో గురువారం గాలికుంటు వ్యాధి నివారణ టీకాల శిబిరాన్ని ఆయన ప్రా రంభించి పశువులకు టీకాలు వేశారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పశువులకు వైరల్ వ్యాఽఽధిగా గాలికుంటు వ్యాఽధి సోకుతుందని ఆవ్యాఽధికి చికిత్స కంటే టీకాతో నివారణతోనే సులువైన మార్గమన్నారు. గ్రామాల్లో ఉచిత టీకాల కార్యక్రమాన్ని పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో వచ్చే నెల 14వ తేదీ వరకు నిర్వహించనున్నామని సద్వినియోగం చేసుకోవాలన్నారు. తెలంగాణలో పాడి పరిశ్రమ, పశు ఉత్పత్తులకు ప్రత్యేక గుర్తింపు రావడంతో పాటు అంతర్జాతీయంగా వ్యాపారాభివృద్ధిఽ రైతుల ఆర్ధిక వ్యవస మెరుగుపడుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా పశువైద్య, పశుసంవర్ధకశాఖ అధికారి డాక్టర్. జివి రమేష్, చిట్యాల మండల పశువైద్యాఽధికారులు డాక్రట్ వి. అభినవ్, డాక్టర్ జె. అమరేందర్ పాల్గొన్నారు.