Share News

వ్యవసాయాభివృద్ధికి సహకార బ్యాంకుల తోడ్పాటు

ABN , Publish Date - May 27 , 2025 | 12:22 AM

వ్యవసాయాభివృద్ధికి సహకార బ్యాంకులు ఎంతగానో తోడ్పాటు అందిస్తున్నాయని, వ్యవసాయ అనుబంధ రంగాల పురోగతికి భారత సహకార వ్య వస్థ అనుసంధానమై పనిచేస్తోందని డీసీసీబీ చైర్మన్‌ కుంభం శ్రీనివా్‌సరెడ్డి అన్నారు.

వ్యవసాయాభివృద్ధికి సహకార బ్యాంకుల తోడ్పాటు

డీసీసీబీ చైర్మన్‌ కుంభం శ్రీనివా్‌సరెడ్డి

ఇండోనేషియాదేశంలో సదస్సుకు హాజరు

నల్లగొండ, మే 26 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయాభివృద్ధికి సహకార బ్యాంకులు ఎంతగానో తోడ్పాటు అందిస్తున్నాయని, వ్యవసాయ అనుబంధ రంగాల పురోగతికి భారత సహకార వ్య వస్థ అనుసంధానమై పనిచేస్తోందని డీసీసీబీ చైర్మన్‌ కుంభం శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. సోమవా రం ఇండోనేషియా దేశంలోని బాలి నగరంలో బ్యాంక్‌ ఆఫ్‌ ఇండోనేషియా ఆధ్వర్యంలో ఆసియా-పసిఫిక్‌ దేశాలకు చెందిన సహకారబ్యాంకులు వ్యవసాయరంగానికి ఎలాంటి తోడ్పాటు అందిస్తున్నాయనే అంశంతో పాటు భవిష్యత్‌లో చేపట్టాల్సిన సహకారంపై నిర్వహించిన సదస్సు లో ఆయన మాట్లాడారు. రీజనల్‌ పాలసీ ఫో రం, 78వ ఆసియా-పసిఫిక్‌ రూరల్‌ అండ్‌ అగ్రికల్చర్‌ క్రెడిట్‌ అసోసియేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ కమి టీ ఈ సదస్సును నిర్వహించగా, శ్రీనివా్‌సరెడ్డి మాట్లాడుతూ, భారతదేశంలో సహకార రంగం, సహకార బ్యాంకులు వ్యవసాయ, అనుబంధ రంగాల పురోభివ్దృద్ధిలో కీలకభాగస్వామ్యం వహిస్తున్నాయన్నారు. ప్రధానంగా నాణ్యమైన ఎరువులు, విత్తనాలను అందించడమేగాక ఔత్సాహిక రైతాంగానికి సబ్సిడీలు, వ్యవసాయాధారిత పరిశ్రమలు, సేవాసంస్థల ఏర్పాటుకు సహకార బ్యాంకులు వెన్నుదన్నుగా నిలిచాయని పేర్కొన్నారు. పర్యావరణ సహితమైన వ్యవసాయ అనుబంధపరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించడమే లక్ష్యంగా సహకార బ్యాంకులు మరింత బలంగా పనిచేయాల్సి ఉందన్నారు. వ్యర్థాలను వీలైనంతమేర నియంత్రించేలా సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు కృషి చేయాల్సి ఉందని తెలిపారు. భారతదేశంలో వ్యవసాయరంగమే నేటికీ అత్యధికభాగం జనాభాకు జీవనోపాధి అందిస్తోందని, కీలకమైన ఈ రంగంలో సాంకేతిక అవృద్ధికి, ఆధునిక సాగువిధానాలకు అవసరమైన ప్రోత్సాహకాలను అందించేలా సహకారబ్యాంకులకు తోడ్పాటు దక్కాలని పేర్కొన్నారు. ఈ నెల 28వరకు మూడురోజుల పాటు సాగే పర్యటనలో వ్యవసాయరంగ అభివృద్ధిలో ఇండోనేషియా అవలంభిస్తున్న విధానాలను, అక్కడి సహకార బ్యాంకుల పనితీరు, వ్యవసాయ వ్యర్థాలు, కాలుష్య నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను పరిశీలిస్తామని ఆయన తెలిపారు.

Updated Date - May 27 , 2025 | 12:22 AM