ఎండలు బాబోయ్
ABN , Publish Date - Jun 08 , 2025 | 12:02 AM
భానుడి ప్రతాపం కొనసాగుతూనే ఉంది. ఈ ఏడాది కాస్త ముందుగా వచ్చిన రుతుపవనాలతో ఎండలు తగ్గాయని జిల్లా ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
బీబీనగర్‌లో 40.5 డిగ్రీల నమోదు
భువనగిరి(కలెక్టరేట్), జూన్ 7 (ఆంధ్రజ్యోతి): భానుడి ప్రతాపం కొనసాగుతూనే ఉంది. ఈ ఏడాది కాస్త ముందుగా వచ్చిన రుతుపవనాలతో ఎండలు తగ్గాయని జిల్లా ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కానీ జిల్లాలో శుక్రవారం, శనివారం రెండు రోజులు ఎండలు దంచి కొట్టడంతో 40 డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శనివారం జిల్లాలో 17 మండలాలవారీగా నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు ఈవిదంగా ఉన్నాయి. బీబీనగర్, భువనగిరి, ఆత్మకూ(ఎం), రామన్నపేట మండలాల్లో 40 డిగ్రీలకుపై ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
మండలం గరిష్ఠం
బీబీనగర్ 40.5
భువనగిరి 40.2
ఆత్మకూరు(ఎం) 40.2
రామన్నపేట 40.0
మోత్కూరు 39.6
గుండాల 39.6
మూటకొండూరు 39.5
చౌటుప్పల్ 39.4
యాదగిరిగుట్ట 39.2
భూదాన్ పోచంపల్లి 39.1
ఆలేరు 39.1
అడ్డగూడూరు 38.9
రాజాపేట 38.7
తుర్కపల్లి 37.8
బొమ్మలరామారం 37.7
నారాయణపురం 37.6
వలిగొండ 37.6