సమస్యలు తీర్చకపోవడంతోనే సమ్మె నోటీస్
ABN , Publish Date - Apr 09 , 2025 | 12:42 AM
ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు తీర్చకపోవడంతోనే సమ్మె నోటీస్ ఇచ్చినట్లు తెలంగాణ మజ్దూర్ యూనియన రాష్ట్ర కార్యదర్శులు బుడిగ పుల్లయ్య, సుంకరి శ్రీనివాస్ అన్నారు.

సూర్యాపేట అర్బన, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి) : ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు తీర్చకపోవడంతోనే సమ్మె నోటీస్ ఇచ్చినట్లు తెలంగాణ మజ్దూర్ యూనియన రాష్ట్ర కార్యదర్శులు బుడిగ పుల్లయ్య, సుంకరి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ఆర్టీసీ డిపో ఎదుట నిరసన తెలిపి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన డిమాండ్లను తీర్చనందు న మే 7వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు పిలుపు ఇచ్చినట్లు తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులపై పనిఒత్తిడి తగ్గించాలని విన్నవించినా ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో సమ్మెకు పిలుపునిచ్చామన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు గతంలో ఉన్న 500 కిలోమీటర్ల పనిభారాన్ని 600లకు పెంచారని, హామీ ల మేరకు ఇస్తారన్న అలవెన్సలు ఇవ్వడం లేదన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎ్‌సగౌడ్, సైదులు, వెంకన్న, మధు, సేవ్యా, బాను, అబ్థుల్, గని, లచ్చయ్య, ఏకాంబరం, సావిత్రి, సైదమ్మ, సాగర్, వెంకన్న పాల్గొన్నారు.