Share News

సీసీఐ కఠిన నిబంధనలు ఎత్తివేయాలి: సీపీఎం

ABN , Publish Date - Nov 07 , 2025 | 12:24 AM

పత్తి కొనుగోలు సందర్భంగా రైతులకు ఇబ్బంది కలిగించే కఠిన నిబంధనలను సీసీఐ వెంటనే ఎత్తి వేయాలని సీపీఎం మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు డిమాండ్‌ చేశారు.

సీసీఐ కఠిన నిబంధనలు ఎత్తివేయాలి: సీపీఎం
మోత్కూరు: పత్తిచేనును పరిశీలిస్తున్న సీపీఎం నాయకులు

మోత్కూరు, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): పత్తి కొనుగోలు సందర్భంగా రైతులకు ఇబ్బంది కలిగించే కఠిన నిబంధనలను సీసీఐ వెంటనే ఎత్తి వేయాలని సీపీఎం మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు డిమాండ్‌ చేశారు. గురువారం మండలంలోని రాగిబావి గ్రామంలో వర్షాలకు దెబ్బతిన్న పత్తి చేలను సీపీఎం నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకవైపు వర్షాలకు పత్తి చేలు దెబ్బతిని దిగుబడి తగ్గిపోగా మరో వైపు సీసీఐ కఠిన నిబంధనలు పెట్టి పత్తి కొనడం లేదని విమర్శించారు. కపాస్‌ కిసాన యాప్‌ ద్వారా స్లాట్‌ బుక్‌ చేసుకోవాలంటే నిరక్ష్యరాస్యులైన రైతులు, స్మార్ట్‌ ఫోన లేని రైతులు ఎలా బుక్‌ చేసుకుంటారని ఆయన ప్రశ్నించారు. సీసీఐ కఠిన నిబంధనలు తొలగించి ప్రతి రైతు వద్ద పత్తికొనాలన్నారు. మండల కమిటి సభ్యులు దడిపల్లి ప్రభాకర్‌, పానుగుల రమేష్‌, మెండు శేఖర్‌రెడ్డి, చంద్రయ్య ఆయన వెంట ఉన్నారు.

Updated Date - Nov 07 , 2025 | 12:24 AM