Share News

ఆరేళ్లకే నటనలో నడకలు

ABN , Publish Date - Jul 10 , 2025 | 12:39 AM

వచ్చిన అవకాశాన్ని అంది పుచ్చుకుని టీవీ సీరియల్స్‌, సినిమాల్లో నటిస్తూ తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు చైల్డ్‌ ఆర్టిస్టు మోక్షజ్ఞ. ఖమ్మం జిల్లా కేంద్రానికి చెందిన మోక్షజ్ఞకు ఆరేళ్ల వయస్సులోనే టీవీ సీరియల్‌లో అవ కాశం రావడంతో నటన ప్రారంభించి ఇప్పటి వరకు దాదాపుగా 12కు పైగా తెలుగు సినిమాల్లో నటించాడు. (ఆంధ్రజ్యోతి -మిర్యాలగూడ )

 ఆరేళ్లకే నటనలో నడకలు

ఆరేళ్ల వయసులోనే నటన రంగంలో అవకాశం రావడంతో టీవీ సీరియల్స్‌, సినిమాలు, టీవీ యాడ్స్‌తో 13 ఏళ్ల వయసులోనే తనకంటూ గుర్తింపును తెచ్చుకుంటున్నాడు బాల నటుడు మోక్షజ్ఞ. ఖమ్మంలో 8వ తరగతి చదువుతూనే వచ్చిన అవకాశాలను జారవిడుచుకోకుండా నటనతో ప్రేక్షకులను మెప్పించేందుకు కృషి చేస్తున్నాడు. మోక్షజ్ఞ తల్లిదండ్రులు లింగం సతీష్‌, అరు ణ ప్రభుత్వ ఉపాధ్యాయులు. ఇంట్లోనే గురువులు ఉండటం వల్ల వారి బోధనలతో చదువులోనూ మోక్షజ్ఞ ముందు వరసలో ఉన్నారు. మోక్షజ్ఞ అమ్మమ్మ ఊరు హుజూర్‌నగర్‌. ఖమ్మంకు చెందిన మిర్యాలగూడకు వచ్చిన సందర్భంగా మోక్షజ్ఞ ‘ఆంధ్రజ్యోతి’తో ముచ్చటించారు.

టీవీ సీరియల్‌తో ఆరంగేట్రం

సీరియల్స్‌ను నిర్మించే మన స్టూడియో అధినేత డీవై చౌదరి మోక్షజ్ఞ కు ఆరేళ్ల వయసులో ‘కల్యాణి’ టీవి సీరియల్‌లో బాలనటుడిగా చిన్న పాత్రకు అవకాశం కల్పించారు. ఏమాత్రం తడబాటు లేకుండా స్పష్టంగా డైలాగ్‌ డెలివరీ చే యడంతో పాటు డైరెక్టర్‌ సూచించిన విధంగా హావభావాలు వ్యక్తం చేయడంతో ‘శ్రీమతి’ సీరియల్‌లో లీడ్‌రోల్‌కు అవకాశం ఇచ్చి మోక్షజ్ఞలోని నటనకు మెరుగులు దిద్దారు. సినిమాల్లో అవకాశాలు వచ్చాయి.

అగ్రహీరోల సరసన

తొలిసినిమా ప్రభా్‌సతో సలార్‌లో నటించారు. అల్లుఅర్జునతో పుష్ప-2లో, నితీన సినిమా మాసో్ట్ర, ఓరి దేవుడా, రైటర్‌ పద్మభూషణ్‌, రవికుల రఘురామ్‌ తదితర 12 సినిమాల్లో ఇప్పటివరకు నటించారు. కొణిదెల ఉపాసనతో హెల్త్‌కు సంబంధించిన ఇనస్టాగ్రామ్‌ యాడ్‌లో, హనుమాన హీరో తేజాసజ్జాతో డ్రైప్రూట్‌కుసంబంధించిన యాడ్‌తో కలిసి 10 వరకు యాడ్స్‌ కూడా చేశారు.

Updated Date - Jul 10 , 2025 | 12:40 AM