Share News

నేటి నుంచి రాష్ట్ర స్థాయి నాటకోత్సవాలు

ABN , Publish Date - Jul 15 , 2025 | 12:44 AM

కోమలి కళా సమితి నల్లగొండ ఆధ్వర్యంలో ఈనెల 15 నుంచి 17వ తేదీ వరకు నిర్వహించే తెలంగాణ రాష్ట్ర స్థాయి నాటకోత్సవాలు నల్లగొండ పట్టణంలో సర్వం సిద్ధం చేశారు.

నేటి నుంచి రాష్ట్ర స్థాయి నాటకోత్సవాలు

నల్లగొండ కల్చరల్‌, జూలై 14 (ఆంధ్రజ్యోతి): కోమలి కళా సమితి నల్లగొండ ఆధ్వర్యంలో ఈనెల 15 నుంచి 17వ తేదీ వరకు నిర్వహించే తెలంగాణ రాష్ట్ర స్థాయి నాటకోత్సవాలు నల్లగొండ పట్టణంలో సర్వం సిద్ధం చేశారు. పట్టణంలోని చిన్న వెంకట్‌ రెడ్డి పంక్షన హాల్‌లో మూడు రోజుల పాటు నాటికలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు బక్క పిచ్చయ్య ఒక ప్రకటనలో తెలిపారు. 15వ తేదీన సాయంత్రం 7గంటలకు నాటకోత్సవాలను ముఖ్యఅతిథులచేత ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. 7.15నిమిషాలకు స్వప్నం రావాల్సిన అమృతం నాటిక, రాత్రి 8.30 నిమిషాలకు ఈ మంచం నాది కాదు, 16వ తేదీన అమ్మ చెక్కిన బొమ్మ, రాత్రి ఇది రహదారి కాదు, 17వ తేదీన స్వేచ్ఛ, రాత్రి సంధ్యా వెలుగు నాటికలను ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఈ నాటికలకు సంబంఽధించిన కళాకారులు నల్లగొండకు చేరుకున్నారని కళావేదికను సిద్ధం చేశామని తెలిపారు. ప్రారంభ కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ ఇలాత్రిపాఠి, నాటక సమాజాల సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు రామచందర్‌రావు, శ్యాంప్రసాద్‌ హాజరవుతున్నారని తెలిపారు.

నేడు బుద్ధునితో నా ప్రయాణం నాటకం

బుద్ధిస్టు సోసైటీ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో 15వ తేదీన సాయంత్రం 6.30 అలకాపురి కాలనీలోని ఓ ఫంక్షనహాల్‌లో బుద్ధుడితో నా ప్రయాణం నాటకం ప్రదర్శిస్తున్నట్లు నిర్వాహకులు సంకు హరి, మండల ఆంజనేయులు, నామ వెంకటేశ్వర్లు, సంకు లింగయ్య, నూనె విష్ణు, కొత్త నరేష్‌, జిలుగు రామయ్య ఒక ప్రకటనలో తెలిపారు. సందేశాత్మకమైన నాటకం ప్రదర్శిస్తున్నందున పట్టణ ప్రజలు ఈ నాటకాన్ని తిలకించాలని కోరారు.

Updated Date - Jul 15 , 2025 | 12:44 AM