పదేళ్ల పాలనలో సొంతిల్లు కలే
ABN , Publish Date - Aug 22 , 2025 | 01:02 AM
బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో పేదలకు సొంతిల్లు కలగానే మిగిలిందని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని నాతాళ్లగూడెం గ్రామంలో ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించి మాట్లాడారు.
భువనగిరి ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి
వలిగొండ, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో పేదలకు సొంతిల్లు కలగానే మిగిలిందని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని నాతాళ్లగూడెం గ్రామంలో ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించి మాట్లాడారు. బీఆర్‌ఎస్ హయాంలో కూలిపోయే ప్రాజెక్ట్‌లను కట్టి రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారన్నారు. గృహప్రవేశం చేసిన దంపతులకు ఎమ్మెల్యే నూతన వస్ర్తాలను అందించారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ భీమా నాయక్, మాజీ ఎంపీపీ నూతి రమే్‌షరాజు, చిట్టెడి జనార్థన్, ఎంపీడీవో జలంధర్‌రెడ్డి పాల్గొన్నారు.
భువనగిరి రూరల్: కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చిందని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని బండసోమారంలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాల కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పట్టు వస్ర్తాలు బహూకరించారు. మండలంలోని బండసోమారం, నమాత్‌పల్లి, గౌస్‌నగర్, ఎర్రంబెల్లి, తుక్కాపురం గ్రామాల్లో వివిధ అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో టీజీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావి సురేందర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేతలు పచ్చిమట్ల శివరాజు గౌడ్, ఎలిమినేటి కృష్ణారెడ్డి, నానం కృష్ణ, ప్రత్యేక అధికారి శ్యాంసుందర్, ఎంపీడీవో సీహెచ్ శ్రీనివాస్, పాశం శివానంద్ తదితరులుపాల్గొన్నారు.