‘ఫోనఇన’తో సమస్యల పరిష్కారం
ABN , Publish Date - Jul 29 , 2025 | 12:15 AM
మునిసిపల్ కమిషనర్ దృష్టికి వచ్చిన సమస్యల్లో కొన్నింటికి పరిష్కారం లభించింది.
ఆర్థిక సంబంధమైనవి పరిష్కరించలేదు: కమిషనర్
ఫ ఇక నుంచి గ్రీవెన్సలో ప్రతీరోజు సమస్యలు వింటాం
మోత్కూరు, జూలై 28 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్ కమిషనర్ దృష్టికి వచ్చిన సమస్యల్లో కొన్నింటికి పరిష్కారం లభించింది. మోత్కూరు మునిసిపాలిటీలో నెలకొన్న సమస్యలపై ‘ఆంధ్రజ్యోతి’ ఈ నెల 2వ తేదీన మునిసిపల్ కమిషనర్‌తో ‘ఫోన ఇన’ కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ కార్యక్రమంలో 25 మంది పట్టణ వాసులు మునిసిపాలిటీలోని పలు సమస్యలను కమిషనర్ కె.సతీ్‌షకుమార్ దృష్టికి తెచ్చారు. అందులో కొన్ని మాత్రమే పరిష్కారమయ్యాయని కాలర్స్ (సమస్యలను కమిషనర్ దృష్టికి తెచ్చిన వారు) ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు. ఆర్థిక సమస్యతో కూడుకున్న పనులు తప్ప మిగతావన్నీ పూర్తి చేశామని మునిసిపల్ కమిషనర్ తెలిపారు. పారిశుధ్యం, వీధిలైట్లు లాంటి సమస్యలను పరిష్కారించామని, ఇంకా ఏవైన మిగిలి ఉంటే వెంటనే పరిష్కరిస్తామన్నారు. ఈ నెల 18వ తేదీన కాలర్స్‌కు తాను ఫోన చేసి సమస్యలు పరిష్కారమయ్యాయా లేదా అని కూడా అడిగి తెలుసుకున్నానన్నారు. పరిష్కారం కాలేదని చెప్పిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని తమ సిబ్బందిని ఆదేశించి పనులు పూర్తి చేయించామన్నారు. సీసీ రోడ్లు, మురికి కాల్వల నిర్మాణం, వీధి లైట్ల కోసం నూతన విద్యుత లైన నిర్మాణం లాంటి సమస్యలు బడ్జెట్‌తో కూడుకున్న సమస్యలు అయినందున పెండింగ్‌లో ఉన్నాయని కమిషనర్ తెలిపారు.
మినీ ట్యాంకుబండ్ పుట్‌పాతపై కంపచెట్లు, ఇతర పిచ్చిమొక్కలు పెరిగి నడవడానికి వీలులేకుండా ఉందని తాను వాకర్స్ అసోసియేషన పక్షాన ఫోనఇన కార్యక్రమంలో కమిషనర్ దృష్టికి తీసుకెళ్లగా ఫుట్‌పాతపై పెరిగిన చెట్లు తొలగించి సమస్యను పరిష్కరించారని తీపిరెడ్డి సోమిరెడ్డి తెలిపారు. మినీ ట్యాంక్ బండ్‌పై లైట్లు లేవని చెప్పగా ఆ సమస్యను కూడా పరిష్కరించారన్నారు.
ఫ నర్సరీలు, క్రీడా మైదానాలు బోర్డులకు పరిమితమయ్యాయని, మెయినరోడ్డు వెడల్పుగా ఉండి పాత చేనేత సహకార సంఘం సమీపాన చెరువులోకి వచ్చే బృందావన కాల్వ కల్వర్టు ఇరుకుగా ఉండటంతో వ్యక్తులు అందులో పడి గాయపడుతున్నారని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లగా అక్కడ ఇనుప జాలీ పెట్టిస్తామని పెట్టించలేదని మాజీ ఎంపీటీసీ జంగ శ్రీనివాస్ తెలిపారు. క్రీడా మైదానాలు ఇప్పటికే బోర్డులకే పరిమితమయ్యాయని పేర్కొన్నారు.
వీధి లైట్లు వెలగడం లేదని, మురికి కాల్వలు శుభ్రం చేయడం లేదని, చెత్త సేకరణ బండి రావడం లేదని తాము కమిషనర్ దృష్టికి తీసుకెళ్లగా పరిష్కారమయ్యాయని ఆ సమస్యలు ప్రస్తావించిన వారిలో ఎక్కువ మంది చెప్పగా సజ్జనం మనోహర్ మాత్రం తమ ఇంటి వద్ద ఉన్న మురికి కాల్వ శుభ్రం చేయలేదని చెప్పారు. దోమల బెడద ఎక్కువగా ఉందని చెప్పగా పలు చోట్ల దోమల మందు పిచికారి చేయించారని చెప్పారు.
ఫ మరో సారి కాలర్స్‌తో మాట్లాడి సమస్యలు మిగిలి ఉంటే వెంటనే పరిష్కరిస్తామని మునిసిపల్ కమిషనర్ చెప్పారు.
ఇక ముందు ప్రతి రోజూ సమస్యలు అధికారుల దృష్టికి తీసుక రావడానికి మునిసిపల్ కార్యాలయంలో గ్రీవెన్స సెల్ ఏర్పాటు చేశామని, టోల్ ఫ్రీ నంబరు నంబరు రాగానే ప్రజలకు తెలియజేస్తామన్నారు. వార్డులో వార్డు ఆఫీసర్, ఇతర సిబ్బంది పేర్లు, ఫోన నంబర్లతో బోర్డులు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.