మహిళా సాధికారతతోనే సమాజం అభివృద్ధి
ABN , Publish Date - Mar 12 , 2025 | 12:22 AM
చండూరు రూరల్, మార్చి11 (ఆంధ్రజ్యోతి): మహిళా సాధికారతతోనే సమాజం అభివృద్ధి చెందు తుందని కస్తూరి ఫౌండేషన సభ్యుడు పిన్నింటి నరేందర్‌రెడ్డి అన్నారు.

చండూరు రూరల్, మార్చి11 (ఆంధ్రజ్యోతి): మహిళా సాధికారతతోనే సమాజం అభివృద్ధి చెందు తుందని కస్తూరి ఫౌండేషన సభ్యుడు పిన్నింటి నరేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని పుల్లెంల గ్రామంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని మంగళవారం జడ్పీ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలల ఆవరణలో మహిళా ఉపాధ్యాయులను సన్మానించారు. నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ సామాజిక అసమానతలపై పోరాడిన సహృదయశీలి భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు, రచయిత్రి సావిత్రి బాయి పూలే అని గుర్తు చేస్తూ మహిళలు ఆమె అడుగుజాడల్లో నడవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో సభ్యులు ఇరిగి శివ, ముక్కాముల రాజు, ముక్కాముల సైదులు, ఉపాధ్యాయులు రాపో లు లక్ష్మీనారాయణ, హైమావతి, కూపిరెడ్డి సువర్ణ, సునీత, సుగుణ, లక్ష్మి ఉన్నారు.