Share News

ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీ

ABN , Publish Date - Aug 07 , 2025 | 12:14 AM

కొండమల్లేపల్లి, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): మండలంలోని గ్రా మాల్లో 2024 ఏప్రిల్‌ 1 నుంచి 2025 మార్చి 31వ తేదీ వరకు చేపటిన ఉపాధి హామీ పనులపై స్థానిక ఎంపీడీవో కార్యాల యంలో అడిషనల్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ నవీన్‌కుమార్‌ ఆధ్వర్యంలో 4వ విడత సామాజిక తనిఖీ నిర్వహించారు.

 ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీ

కొండమల్లేపల్లి, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): మండలంలోని గ్రా మాల్లో 2024 ఏప్రిల్‌ 1 నుంచి 2025 మార్చి 31వ తేదీ వరకు చేపటిన ఉపాధి హామీ పనులపై స్థానిక ఎంపీడీవో కార్యాల యంలో అడిషనల్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ నవీన్‌కుమార్‌ ఆధ్వర్యంలో 4వ విడత సామాజిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా మం డలంలో సుమారు రూ.5.50 కోట్ల కింద జరిగిన పనులకు సంబ ంధించి పలు రికార్డులను పరిశీలించారు. జిల్లా అధికారులు ఈ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి పలు సూచనలు చేశారు. తనిఖీ అనంతరం విజిలెన్స్‌ అధికారి వేణుగోపాలరావు మాట్లాడుతూ ఈ రోజు జరిగిన సామాజిక తనిఖీ పరంగా గ్రామపంచాయతీల్లో విధు లు నిర్వహిఇంచే ఉద్యోగులు సరైన రికార్డులను ఏర్పాటు చేసు కోవా లని ఇప్పటివరకు ఈ మండలంలో పనిచేసే ఉద్యోగులపై దాదా పుగా 1,342 అభ్యంతరాలు ఉన్నాయని వాటికి సంబంధించిన ఉద్యోగుల సంజాయిషీ ఇవ్వాల్సి ఉందన్నారు. ఈ తనిఖీలో అసిస్టెం ట్‌ క్లస్టర్‌ పీడీ యామిని, జిల్లా విజిలెన్స్‌ అధికారి వేణు గో పాలరావు, క్వాలిటి కంట్రోల్‌ ఫసియుద్దీన్‌, ఎంపీడీవో బాలరాజురెడ్డి, ఏపివో రామచంద్రనాయక్‌, రాష్ట్ర రిసోర్స్‌ పర్సన్‌ శ్రీకాంత్‌, రాజు టెక్నికల్‌ అసిస్టెంట్లు, ఈజీఎస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Aug 07 , 2025 | 12:14 AM