Share News

నైపుణ్యాల పెంపే లక్ష్యం

ABN , Publish Date - May 14 , 2025 | 12:41 AM

విద్యార్థుల్లో అంతర్గత సామర్థ్యాలు, సృజనాత్మకత, నైపుణ్యాల పెంపే లక్ష్యంగా విద్యాశాఖ సరికొత్త కార్యక్రమాల కు శ్రీకారం చుడుతోంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతోపాటు ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల నైపుణ్యాలను పెంచేందుకు ఈ నెలలో ప్రభుత్వ పాఠశాలల ఆవరణల్లో ‘యంగ్‌ ఇండియా’ వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహించనుంది.

నైపుణ్యాల పెంపే లక్ష్యం

విద్యార్థులకు ‘యంగ్‌ ఇండియా’ వేసవి శిక్షణ శిబిరాలు

జిల్లాలో 50 పాఠశాలలు ఎంపిక

రేపటి నుంచి శిక్షణ శిబిరాలు ప్రారంభం

మోత్కూరు, మే 13 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల్లో అంతర్గత సామర్థ్యాలు, సృజనాత్మకత, నైపుణ్యాల పెంపే లక్ష్యంగా విద్యాశాఖ సరికొత్త కార్యక్రమాల కు శ్రీకారం చుడుతోంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతోపాటు ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల నైపుణ్యాలను పెంచేందుకు ఈ నెలలో ప్రభుత్వ పాఠశాలల ఆవరణల్లో ‘యంగ్‌ ఇండియా’ వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహించనుంది.

జిల్లాలో 50 పాఠశాలల ఎంపిక

జిల్లాలో ‘యంగ్‌ ఇండియా’ వేసవి శిక్షణ శిబిరా ల నిర్వహణకు మోత్కూరు, అడ్డగూడూరు, గుండా ల, వెల్మజాల ఉన్నత పాఠశాలలతోపాటు మొత్తం 50 ఉన్నత పాఠశాలలను ఎంపిక చేశారు. విద్యార్థు లు చదువుతోపాటు అన్నిరంగాల్లో రాణించాలన్న ఉద్దేశంతో విద్యాశాఖ ఈ కార్యక్రమం చేపట్టింది. ఎంపిక చేసిన పాఠశాలల్లో 15 రోజులపాటు రోజూ ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు 3 గంటలపాటు వివిధ అంశాల్లో శిక్షణ ఇస్తారు. శిక్షణ శిబిరాలు ఈ నెల 15న ప్రారంభమై 31న ముగుస్తాయి. 6నుంచి 9వ తరగతి విద్యార్థులకు శిక్షణ పొందడానికి అర్హులు. ప్రధానోపాధ్యాయులు, సీనియర్‌ ఉపాధ్యాయుడు ఈ శిబిరాలను పర్యవేక్షిస్తారు.

శిక్షణనిచ్చే అంశాలు...

చదరంగం, క్యారమ్స్‌లాంటి ఇండోర్‌ గేమ్స్‌, యోగా, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, స్పోకెన్‌ ఇంగ్లీష్‌, మ్యాథ్స్‌ బేసిక్స్‌, పిల్లల ఆసక్తికి అనుగుణంగా కుట్లు, అల్లికలు, బ్యూటీషియన్‌, సాంస్కృతిక కార్యకలాపాల్లో తర్ఫీదు, సామాజిక సేవ తదితర అంశాల్లో శిక్షణనిస్తారు. స్థానికంగా ఉన్న వనరులననుసరించి ఆయా అంశాలను ఎంపిక చేస్తారు.

ఒక్కో శిబిరంలో 100 మందికి అవకాశం

ఒక్కో శిబిరంలో 100 మంది విద్యార్థులు చేరేందుకు అవకాశం ఉంటుంది. 50 మంది చేరితే రూ.25వేలు, వంద మంది చేరితే రూ.50వేలు నిర్వహణ ఖర్చులకు ప్రభుత్వం వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహించే పాఠశాలలకు ఇస్తుంది. విద్యార్థులకు శిక్షణనివ్వడానికి ట్రైనర్లను నియమించి వారికి గౌరవ వేతనం ఇస్తారు. శిక్షణకు వచ్చే విద్యార్థులకు అల్పాహారం కూడా అందిస్తారు.

యంగ్‌ ఇండియా లక్ష్యాలు

విద్యార్థుల్లో జీవన నైపుణ్యాల పెంపు, స్వతహాగా ఆలోచించడం, సామూహికంగా పనులు చేయడం, వారిలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీస్తారు. భ్యాసనా ప్రక్రియల్లో పాల్గొనడం, ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించడం, ఉత్పాదకతపై అవగాహన లక్ష్యంగా శిబిరాలు నిర్వహించనున్నారు.

అన్ని రంగాల్లో రాణించాలనే: తీపిరెడ్డి గోపాల్‌రెడ్డి, ఎంఈవో, మోత్కూరు

విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో రాణించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ‘యంగ్‌ ఇండియా’ వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నది. ఈ శిబిరాలు విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.

Updated Date - May 14 , 2025 | 12:41 AM