భూ సమస్య పరిష్కరించాలని వెళ్తే ఎస్‌ఐ కొట్టాడు
ABN , Publish Date - Jun 28 , 2025 | 12:28 AM
చండూరు రూరల్, జూన్ 27(ఆంధ్రజ్యోతి): భూ తగాదాలో సమస్యను పరిష్కరించాలని పోలీ్‌సస్టేషన్‌కు వెళ్లిన తనను చండూరు ఎస్‌ఐ వెంకన్న అసభ్యంగా తిడుతూ కొట్టాడని నల్లగొండ జిల్లా చండూరు మండలం తాస్కానిగూడెం గ్రామానికి చెందిన రైతు ఆవుల వెంకన్న ఆరోపించాడు.
చండూరు రూరల్, జూన్ 27(ఆంధ్రజ్యోతి): భూ తగాదాలో సమస్యను పరిష్కరించాలని పోలీ్‌సస్టేషన్‌కు వెళ్లిన తనను చండూరు ఎస్‌ఐ వెంకన్న అసభ్యంగా తిడుతూ కొట్టాడని నల్లగొండ జిల్లా చండూరు మండలం తాస్కానిగూడెం గ్రామానికి చెందిన రైతు ఆవుల వెంకన్న ఆరోపించాడు. బాధితుడు వెం కన్న ఇందుకు సంబంధించిన వివరాలను శుక్రవారం విలేకరులకు తెలిపారు. తాస్కానిగూడెంలో తనకున్న పొలంలో సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నానని, కొద్దికాలంగా తన బాబాయి అ యిన ఆవుల ఆంజయ్యతో గెట్ల పంచాయితీ కొనసాగుతుండటంతో పెద్ద మనుషుల సమక్షంలో పలుమార్లు పంచాయితీ పెట్టినా పరిష్కారం కాలేదన్నారు. ఈ ఘటనపై మే 23వ తేదీన స్థానిక పోలీ్‌సస్టేషన్‌లో ఇరువర్గాల ఫిర్యాదుతో ఎస్‌ఐ వెంకన్న పిలిపించి పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకోవాలని సూచించారన్నారు. ఆంజయ్య వినక పోగా తనపై గొడవకు దిగుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవుల వెంకన్న ఎస్‌ఐకు తెలిపాడు. ఈ క్రమంలో ఎస్‌ఐ వెంకన్న తనను గురువారం పోలీస్ స్టేషన్‌కు పిలిపించి అసభ్యంగా మాట్లాడి, కడుపులో, తలపై, మె డపై పిడిగుద్దులు గుద్దినట్లు చెప్పారు. దీంతో కడుపు నొప్పి, మెడనొప్పి రావడంతో బంధువుల సా యంతో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి చికిత్స చేయించుకున్నానని తెలిపారు. తనను అన్యాయంగా కొట్టిన ఎస్‌ఐ వెంకన్నపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనపై సీఐ ఆదిరెడ్డిని వివరణ కోరగా, భూసమస్య, సివిల్ వ్య వహారాల్లో పోలీసులు ఎప్పుడూ జోక్యం చేసుకోరని తెలిపారు. తాస్కానిగూడెం గ్రామానికి చెందిన ఇరువురు గెట్ల పంచాయితీపై పెద్దమనుషులతో మాట్లాడుకోవాలని సూచించినా వినకుండా ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడంతో వారిని పిలిపించి మాట్లాడుకోవాలని సూచించామని తెలిపారు. ఎవరిపై చేయి చేసుకోలేదని, ఆ గ్రామ పెద్ద మనుషుల ఎదుట కావాలని పోలీసులపై వెంకన్న దురుసుగా ప్రవర్తించాడన్నారు. అయినా ఎలాంటి చర్యలు తీసుకోకుండా వదిలేశామని, సొంత పంచాయితీలకు పోలీసులపై అభాండాలు వేస్తున్నారని వివరించారు.