Share News

సమాజ చలనానికి శేషువాక్యం నిదర్శనం

ABN , Publish Date - May 13 , 2025 | 12:16 AM

నాగార్జునసాగర్‌, మే 12(ఆంధ్రజ్యోతి) : సమాజ చలనానికి శేషువాక్యం నిదర్శనమని సమూహ సెక్యులర్‌ రైటర్‌ జిల్లా కన్వీనర్‌ కస్తూరి ప్రభాకర్‌ అన్నారు.

సమాజ చలనానికి శేషువాక్యం నిదర్శనం

నాగార్జునసాగర్‌, మే 12(ఆంధ్రజ్యోతి) : సమాజ చలనానికి శేషువాక్యం నిదర్శనమని సమూహ సెక్యులర్‌ రైటర్‌ జిల్లా కన్వీనర్‌ కస్తూరి ప్రభాకర్‌ అన్నారు. నాగార్జునసాగర్‌ హిల్‌కాలనీలో దాసి సుదర్శన్‌ చిత్ర కళానిలయంలో చైర్మన్‌ మెహన్‌రాజు అధ్యక్షతన ప్రముఖ కవి శేషు వర్థంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్య, వైద్యం ప్రైవేటీకరణతో మానవ విలువల విధ్వంసంతో భవిష్యత్‌ తరాలు నాశనం అవుతున్నాయన్నారు. అనంతరం శేషువాక్యం అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో కార్టూనిస్టు నర్సిం, పాండురంగారావు, కిరణ్మ యి, స్వతంత్ర, శ్రీనివాస్‌, సమత ప్రసాద్‌, స్వతంత్రరావు, హరి, చక్రి పాల్గొన్నారు.

దాసి సుదర్శన్‌ స్మారక ట్రస్టు కమిటీ ఎన్నిక

సాగర్‌ హిల్‌కాలనీలో ఏర్పాటు చేసిన దాసి సుదర్శన్‌ స్మారక ట్రస్టు కమిటీని సోమవారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా యూవీ మహారాజు, శాశ్వత అధ్యక్షు రాలిగా స్వతంత్ర, సభ్యులుగా సమతా ప్రసాద్‌, రంగారావు, పాండురంగారావు, కిరణ్మయి, రేఖ, అజయ్‌, శ్రీనివా్‌సను ఎన్నుకున్నారు.

Updated Date - May 13 , 2025 | 12:16 AM