కరాటేతో ఆత్మవిశ్వాసం
ABN , Publish Date - Jul 29 , 2025 | 12:18 AM
కరాటేతో ఆత్మవిశ్వాసం, శారీరక దృఢత్వం సమకూరుతాయని పట్టణ ఇన్సపెక్టర్ ఎం.రమేష్ అన్నారు.
భువనగిరి టౌన, జూలై 28 (ఆంధ్రజ్యోతి): కరాటేతో ఆత్మవిశ్వాసం, శారీరక దృఢత్వం సమకూరుతాయని పట్టణ ఇన్సపెక్టర్ ఎం.రమేష్ అన్నారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి తైక్వాండో ఛాంపియనషి్‌ప పోటీల్లో పథకాలు సాధించిన భువనగిరి విద్యార్థులను సోమవారం ఆయన అభినందించి మాట్లాడారు. చదువుతోపాటు ఆసక్తి ఉన్న రంగాల్లోనూ రాణించేందుకు విద్యార్థులు ప్రయత్నించాలని, ఇందుకు తల్లిదండ్రులు పోత్సహించాలని అన్నారు. ఎస్‌ఐలు లక్ష్మీనారాయణ, కుమారస్వామి, నరేష్, కోచలు శివప్రసాద్, రాధ పాల్గొన్నారు.